ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు కూడా సీమకు తీవ్ర నష్టం జరుగుతూనే ఉందని సీమ ఎంపీ టీజీ వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.ఏపీకి కొత్త రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వల్ల సీమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీ వెంకటేష్ అన్నారు.
ఆయన తాజాగా మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతిని ప్రీ జోన్‌గా ప్రకటించడంతో పాటు సీమలో మరో రాజధానిని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశాడు.
జమ్మూ కశ్మీర్‌కు రెండు రాజధానులు ఉన్నట్లుగానే ఏపీకి కూడా రెండు రాజధానులు ఉండటం వల్ల ఇబ్బంది ఏంటీ అంటూ ఆయన ప్రశ్నించాడు.
సీమలో రెండవ రాజధాని ఉండటం వల్ల స్థానిక యువత మరియు ప్రజలు అంతా కూడా లాభపడతారని వెంకటేష్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.అయితే టీజీ తీసుకు వచ్చిన ప్రతిపాధన ఏమేరకు ఆమోద్య దాయకం అనేది ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
జమ్మూ కశ్మీర్ పరిస్థితి వేరు, ఏపీ పరిస్థితి పూర్తిగా విభిన్నం.అలాంటి ఏపీకి రెండు రాజధానులు ఎలా సాధ్యం అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.