ప్రమాదకరంగా మోతె మండల రహదారులు

సూర్యాపేట జిల్లా:మోతె మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు సాగించే ప్రధాన రహదారుల వెంట చెట్లు పెరిగి కొమ్మలు రోడ్లను కమ్మేశాయి.

రోడ్లు మూల మలుపులతో ఉండడం,చెట్ల కొమ్మలు ఏపుగా పెరిగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదకర ప్రయాణం చేయాల్సి వస్తుందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొన్నేళ్లుగా సంబంధిత అధికారులు రహదారుల వెంబడి చెట్లను తొలిగించట్లేదని,ఫలితంగా రహదారిని కమ్మేసిన చెట్ల కొమ్మలతో ఎదురుగా వాహనం వస్తే కిందికి దిగే పరిస్థితి లేదని, దీనితో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని వాపోతున్నారు.సిరికొండ నుండి మోతె మండల కేంద్రానికి వెళ్ళే రోడ్డుపై చెట్లు పెరిగి కొమ్మలు పూర్తిగా మట్టిదారి హద్దును కమ్మెయడంతో రోడ్డు ఇరుకుగా మారిందని,దీనికి తోడు సూచిక బోర్డులు లేకపోవడంతో ములమలుపులు డేంజర్ జోన్లుగా మారాయని అంటున్నారు.

ఇప్పటికైనా సంబధిత అధికారులు స్పందించి గ్రామీణ రహదారులపై ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలు తొలిగించి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

విజయానికి పేదరికం అడ్డు కాదని నిరూపించిన యువకుడు
Advertisement

Latest Suryapet News