సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలో పాన్ షాపుల్లో గుట్కా వ్యాపారం గుట్టుగా సాగుతుందని సమాచారం.నిషేధిత తంబాకు,పొగాకు ఉత్పత్తులు విచ్చలవిడిగా షాప్ యజమానులు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న తరుణంలో మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో గంజాయి విక్రయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని,వాటికి తోడు గుట్కా యువతను పక్కదారి పట్టించేందుకు ఉపయోగ పడుతుందని పలువురు ఆవేదన చెందుతున్నారు.
పాన్ షాపులలో,కిరాణం దుకాణాలలో సంబంధిత తనిఖీలు చేయకపోవడం తో యధేచ్చగా గుట్కా అమ్మకాలు జరుగుతున్నాయని అంటున్నారు.ఇప్పటికైనా కోదాడ పట్టణంలో పాన్ షాపులలో,దుకాణాలను క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి నిషేధిత గుట్కా,తంబాకు ఉత్పత్తులపై ఉక్కుపాదం మోపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.