మసీదు వక్ఫ్ బోర్డ్ ఆస్తులో ఎమ్మెల్యే సైదిరెడ్డి జోక్యం సహించం...!

సూర్యాపేట జిల్లా:పట్టణంలోని ఉస్మానియా మసీద్ షాపింగ్ కాంప్లెక్స్ లోని షాపు నెంబర్ 5 పై తప్పుడు పత్రాలు సృష్టించి మసీదు వక్ఫ్ బోర్డు ( Masjid Waqf Board )ఆస్తులను లక్షల రూపాయల అమ్మకానికి ప్రయత్నిస్తున్న కిరాయిదారురాలు దామర్ల భూలక్ష్మిపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ముస్లిమ్స్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేశారు.

శనివారం హుజూర్ నగర్ తాహాసిల్దార్ కార్యాలయం ఎదుట ముస్లిమ్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి,సీనియర్ అసిస్టెంట్ సుశీలకి( Senior Assistant Susheelaki ) వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఎంజేఏసీ నేతలు మాట్లాడుతూ ఉస్మానియా మసీదు షాపింగ్ కాంప్లెక్స్1995 సంవత్సరంలో నిర్మాణం జరిగి వ్యాపారాలు కొనసాగుతున్నాయని, గత 30 ఏళ్లుగా దామెర్ల భూలక్ష్మి,పండ్ల హుస్సేన్ జాయింట్ వ్యాపారం చేస్తున్నారని వారికి అనుకూలంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి రికమండేషన్ లెటర్ ఎలా రాస్తారని ఎమ్మెల్యే తీరను ఖండించారు.మసీదు వక్స్ బోర్డ్ ఆస్తులలో ఎమ్మెల్యే సైదిరెడ్డి జోక్యం తగదన్నారు.

MLA Saidireddy's Interference In The Properties Of The Mosque Waqf Board Will No

తక్షణమే ఉన్నతస్థాయి అధికారులు షాప్ నెంబర్ 5 ను అర్హులైన ముస్లింలకు కేటాయించాలన్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిమ్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఎండి.

అజీజ్ పాషా,పఠాన్ గౌస్ ఖాన్, జిలాని,మిల్లు రహీం, నజీర్,నిసార్,మోహిన్ ముస్లిం మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇంటి పన్ను కట్టని ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది ధర్నా

Latest Suryapet News