ఎంపీ ఉత్తమ్ పై ఎమ్మెల్యే సైదిరెడ్డి ఫైర్

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

గత కొంతకాలంగా ఉత్తమ్,సైదిరెడ్డి మధ్య మాటలు యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

హుజూర్ నగర్ పట్టణంలో తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో రాజకీయ హత్యలు చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.కోదాడ,హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ ఉన్నప్పుడు ఏ పని కావాలన్నా బ్రోకర్లని ఏర్పాటు చేసుకొని వారిద్వారా కమిషన్ లు రాబట్టడం పనిగా పెట్టుకుంది ఉత్తమ్ అని విమర్శించారు.

MLA Saidireddy Fires On MP Uttam-ఎంపీ ఉత్తమ్ పై ఎమ�

ఓ ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి హోదా మరచి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని,నియోజకవర్గ ప్రజలే నా పిల్లలని చెప్పుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ,హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఎంత మందికి సహాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు,ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ఎస్పి క్యాంపులో ఖచ్చితంగా స్టేడియం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఉత్తమ్ దిగజారి చేస్తున్న అసత్య ఆరోపణలకు ప్రజా క్షేత్రంలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

Advertisement

Latest Suryapet News