లక్ష్మణపురం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:నాంపల్లి మండల పరిధిలోని లక్ష్మణపురం ప్రాజెక్టు(Lakshmanapuram project ) నిర్మాణ పనులను ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ( Komatireddy Raj Gopal Reddy ) పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి జైల్ సింగ్ ను వివరాలు అడుగగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ప్రాజెక్ట్ ఎన్ఈతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే( Komatireddy Raj Gopal Reddy ) మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ మొత్తం ఏడు ప్యాకేజీల వారిగా నిర్మించాల్సి ఉండగా కేవలం రెండు మాత్రమే 40 శాతం వరకు పనులు చేయడం జరిగిందని,మిగతా వాటిని నిర్మించాలంటే పెండింగ్ బిల్లులు,ఫారెస్ట్ ల్యాండ్, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తదితర సమస్యలు ఉన్నాయన్నారు.ఈ సమస్యలు పరిష్కరించి రాబోయే రెండేళ్ళలో ప్రాజెక్టును పూర్తి చేసినట్లయితే ఏదుల నుండి వచ్చే టర్నల్ పూర్తి అయ్యేలోగా మెయిన్ కెనాల్స్,డిస్ట్రిబ్యూటర్ కెనాల్,మైనర్ కెనాల్స్,ఫీల్డ్ కెనాల్స్ కు టెండర్లు పిలిచి కాలువలను పూర్తి చేయాల్సి ఉంటదన్నారు.

MLA Rajagopal Reddy Inspected The Construction Works Of Lakshmanapuram Project-�

కాల్వలను పూర్తి చేయాలంటే ఈ ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంట్ అనుమతులు లేవని,ఈ ప్రాజెక్టు మంచినీటి కొరకు మాత్రమే నిర్మిస్తున్నారని, పూర్తిగా వ్యవసాయం సాగునీటికి ఉపయోగపడాలంటే ఎన్విరాన్మెంట్ అనుమతులు తప్పనిసరి అన్నారు.నేను కేంద్రంతో మాట్లాడి ఎన్విరాన్మెంట్ అనుమతులు తెస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నాంపల్లి జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వరరెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతి,సీనియర్ నాయకులు పూల వెంకటయ్య రెడ్డి, ఎంపీటీసీలు,వివిధ గ్రామాల మాజీ సర్పంచులు,ఉపసర్పంచ్లు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
కులం పేరుతో దూషించిన ముగ్గురికి ఆరు నెలలు జైలు శిక్ష

Latest Nalgonda News