గంజాయి మత్తులో మిర్యాలగూడ యువత

నల్గొండ జిల్లా: మిర్యాలగూడలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను రూరల్ ఎస్సై సతీష్ వర్మ గురువారం అదుపులోకి తీసుకున్నారు.

ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంకు చెందిన రాజు,వంశీ,దుర్గానగర్ కి చెందిన జ్ఞానేశ్వర్,ఈదుల గూడెంకు చెందిన సాయి శ్రీరామ్ అనే నలుగురిని పోలీస్ సెర్చ్ లో భాగంగా పట్టుకోవడం జరిగిందన్నారు.ఈ యువకులు బీహార్( Bihar ) కు చెందిన కొంతమంది యువకుల నుంచి తక్కువ ధరలో గంజాయిని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి మిర్యాలగూడ పట్టణంతో పలు గ్రామాలలో విక్రయించడానికి తీసుకవస్తున్నట్టు తెలిపారు.పుష్ప సినిమాను తలపిస్తున్న మిర్యాలగూడ గత ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఎదురు సందులో గంజాయి మత్తులో ఒక యువకుడిపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.

అందులో ఉన్న యువకులందరూ కూడా 20 సంవత్సరాల వారే కావడం గమనార్హం.రాత్రి వేళల్లో బంగారుగడ్డ, ఈదులగూడెం,రైల్వేస్టేషన్, చింతపల్లి బైపాస్,ఎఫ్సీఐ గోదాం తదితర ప్రాంతాలలో విచ్చలవిడిగా గుపులు గుంపులుగా ఏర్పడి పాదచారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వినికిడి.

ముఖ్యంగా గంజాయి తరలించెందుకు పుష్ప సినిమాను ఆదర్శంగా తీసుకోని లోకల్ లో వున్న వివిధ కంపెనీలకు చెందిన డెలివరి బాయ్స్ ఉపయోగించుకొని అత్యధిక సంఖ్యలో మత్తు పదార్దాల అమ్మకాలు కొనసాగిస్తున్నారని తెలుస్తుంది.ఇప్పటికైనా అధికారులు స్పందించి నియోజకవర్గ పరిధిలోని మత్తుపదార్దాల అమ్మకాలు చేసేవారిని పట్టుకొని శిక్షించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

వావ్, ఆటోను మినీ లైబ్రరీగా మార్చేసిన డ్రైవర్.. బుక్స్ ఫ్రీగా తీసుకోవచ్చట..

Latest Nalgonda News