రేపు సూర్యాపేట జిల్లాలో మంత్రుల పర్యటన...!

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ పౌరసరపాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రేపు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.7 తేదీ ఉదయం హెలికాప్టర్లో ముగ్గురు మంత్రులు హుజూర్ నగర్ చేరుకొని ఏరియా ఆసుపత్రి పరిస్థితి, ఇంకా ప్రజలకు అందాల్సిన వైద్యం సేవలపై సమీక్ష నిర్వహిస్తారు.

అనంతరం హెలికాప్టర్లోనే కోదాడకు వెళ్తారు.

అక్కడ భోజనం అనంతరం కోదాడలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారు.అనంతరం వైద్య సేవలపై సమీక్ష నిర్వహిస్తారు.తిరిగి హెలికాప్టర్ లోనే హైదరాబాద్ చేరుకుంటారు.

Latest Suryapet News