మునిసిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి: ట్రెడ్ యూనియన్ నెమ్మాది

సూర్యాపేట జిల్లా: పారిశుద్ధ్య పనులు చేసే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం మంచిది కాదని తెలంగాణా మునిసిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు.

సోమవారం జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపల్ లో పని చేసే అవుట్ సోర్సింగ్ అండ్ కాంటాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు.ముఖ్యంగా కాంట్రాక్టు కార్మీకులకు ఒప్పంద ప్రకారం 12000 వేల రూపాయల్లో 1600 పిఎఫ్ పేరుతో కట్ చేసుకొని వాటినీ ఫీఎఫ్ లో జమ చేయకుండా కాంట్రాక్టర్ అన్యాయం చేస్తున్నారని మరో నాలుగు వందలు కూడా కార్మికుల నుండి కాజేస్తున్నారన్నారు.

ప్రతి పండకు సెలవులు ఇవ్వాలని,సబ్బులు,బట్టలు, చెప్పులు ఇవ్వాలని,పిఎఫ్,ఈఎస్ఐ అమలు చేయాలని,రాత్రి పూట పని ఆపాలని,కనీస వేతనాలు 26 వేలు ఇవ్వాలని,జవాన్ల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు.అనంతరం మునిసిపల్ కమిషనర్ కు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అద్యక్షుడు ఓగోటి దశరథ, మురళీ,శివ,వెంకన్న,ఎల్లమ్మ,రాజు,లింగయ్య,డేవిడ్,సాయి,తదితరులు పాల్గొన్నారు.

Advertisement
నిరసన చేస్తున్న విద్యార్థి యువజన సంఘాల నేతల అరెస్ట్

Latest Suryapet News