గేమ్ ఛేంజర్, దేవర మధ్య ఇన్ని పోలికలా.. రెండు సినిమాల్లో కథ ఒకటే అంటూ?

టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక ఈ సినిమా తర్వాత ఎవరి కెరియర్ పరంగా వారు బిజీ బిజీగా గడుపుతున్నారు చెర్రీ, తారక్.ఇకపోతే రామ్ చరణ్( Ram Charan ) ప్రస్తుతం గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) దేవర సినిమాలో( Devara ) నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.గ్లోబల్ స్టార్లుగా మారిన తర్వాత రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలు కావడంతో ఈ సినిమాలపై అంచనాలు మరింత పెరిగాయి.

 Game Changer Devara Both To Have Same Setups Details, Game Changer, Devara Movie-TeluguStop.com
Telugu Devara, Rajamouli, Shankar, Game Changer, Gamechanger, Ntr, Koratala Siva

ఈ సినిమాలో త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే.ఆ సంగతి పక్కన పెడితే ఈ రెండు సినిమాల మధ్య చాలా పోలికలు ఉన్నాయంటూ, సోషల్ మీడియాలో ఒక వార్త ఫుల్ వైరల్ గా మారింది.మరి ఆ వివరాల్లోకి వెళితే.తండ్రి ఆశ‌యాన్ని బ‌తికించ‌డానికి పోరాడే త‌న‌యుల క‌థ.గేమ్ ఛేంజ‌ర్‌, దేవ‌ర‌ సినిమాలలో హీరోలిద్ద‌రూ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు.తండ్రీ కొడుకులుగా క‌నిపించ‌బోతున్నారు.

ఫ్లాష్ బ్యాక్‌లో తండ్రి త‌న‌కు అత్యంత స‌న్నిహితుల చేతిలో న‌మ్మ‌క ద్రోహానికి గుర‌వ్వ‌డం, దానిపై కొడుకు రివైంజ్ తీర్చుకోవ‌డం ఈ రెండు క‌థ‌ల్లోనూ ఉమ్మ‌డిగా క‌నిపించే ల‌క్ష‌ణాలు.గేమ్ ఛేంజ‌ర్‌ పూర్తిగా పొలిటిక‌ల్ డ్రామా.

Telugu Devara, Rajamouli, Shankar, Game Changer, Gamechanger, Ntr, Koratala Siva

దేవ‌ర‌ అయితే యాక్ష‌న్ జోన్‌లో సాగే సినిమా.రెండు సినిమాల్లో హీరోలిద్ద‌రూ రెండు గెట‌ప్పుల్లో క‌నిపిస్తారు.అలా ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ఒకే సెట‌ప్పులో ఉన్న క‌థ‌ల్ని ఎంచుకోవ‌డం కాక‌తాళీయ‌మే అని చెప్పాలి.దేవ‌ర‌ రెండు భాగాలుగా విడుద‌ల చేస్తున్నారు.కానీ గేమ్ ఛేంజ‌ర్ మాత్రం సింగిల్ సినిమానే.రాజ‌మౌళితో( Rajamouli ) ప‌ని చేసి, సూప‌ర్ హిట్ కొట్టిన హీరోలు ఆ త‌ర‌వాతి సినిమాలో అంచ‌నాలు అందుకోలేక చ‌తికిల ప‌డ్డారు.

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌కు ఈ అనుభ‌వం ఉంది.మరి ఈసారి ఏం జ‌రుగుతుందో అనే ఆత్రుత అంద‌రిలోనూ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube