కూరగాయ పంటలను చీడపీడల నుంచి సంరక్షించే పద్ధతులు..!

కూరగాయ పంటలకు చీడపీడల, నులిపురుగుల బెడద చాలా ఎక్కువ.సరైన సమయంలో కొన్ని సంరక్షణ పద్ధతులు పాటించక పోతే త్రీవ నష్టం వాటిల్లుతుంది.

 Methods Of Protecting Vegetable Crops From Pests , Vegetable Crops, Pests, Worm-TeluguStop.com

ప్రధాన కూరగాయ పంటలైన టమాటా, కీరదోస, పొట్ల, కాకర, బీట్రూట్, ముల్లంగి, గుమ్మడి లాంటి పంటలకు నులిపురుగుల బెడద చాలా ఎక్కువ.ఈ పురుగులు సుమారు 0.5 నుంచి 2 మి.మీ ల పరిమాణంలో ఉండి కంటికి సరిగా కనిపించవు.ఎక్కువగా చెట్ల వేర్లపై, కొమ్మలపై, ఆకులు, పూతపై దాడి చేసి నష్టం కలిగిస్తాయి.కూరగాయ పంటలను రోటిలెంకిన్, హెటిరోలెంకస్, మెలాయి డోగైన్ ఇన్ కాగ్నిటం లాంటి పురుగులు ఎక్కువగా ఆశించి చెట్లలోని రసాన్ని పూర్తిగా పీల్చేస్తాయి.

తర్వాత మొక్కలు పసుపు రంగులోకి మారడం, ఎండిపోవడం, మొక్క వేర్లపై బుడిపేలు రావడం జరుగుతుంది.

ఒకే రకం కూరగాయలను పదేపదే వేయడం, ఉష్ణోగ్రత అధికంగా ఉండడం, నేలలో అధిక తేమ ఉండడం వల్ల నులిపురుగులు విపరీతంగా వచ్చి పంటను నాశనం చేస్తాయి.మామూలు పొలాల్లో కంటే రక్షిత గృహాల్లో నులిపురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది.కూరగాయ పంటలను చీడపీడల, నులిపురుగుల నుండి సంరక్షించుకోవాలంటే వేసవిలో పొలాన్ని బాగా దుక్కి దున్నలి, ఒకే పంట వేయకుండా పంట మార్పిడి చేయడం, అధిక మోతాదులో సేంద్రీయ ఎరువుల వాడకం, పొలాల్లో కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, నులి పురుగులు ఎక్కువగా ఆశించే పొలాల్లో వేప పిండి, వేప చెక్క వినియోగించడం లాంటివి చేయాలి.

తర్వాత పంట పొలాల్లో 1000 కేజీల పశువుల పేడను బాగా చిలికి అందులో రెండు కేజీల సూడోమోనాస్ G2 , 2 కిలోల పెసిలోమైసిన్ కలిపి 25 శాతం తేమ ఉండేలా 15 రోజులు గోన సంచులు కప్పి ఉంచి వారానికి ఒకసారి బాగా కలిపి ప్రధాన పొలాల్లో చల్లాలి.భూమిలో వేడి అధికంగా ఉండాలంటే మట్టిని ప్లాస్టిక్ మల్చింగ్ తో కప్పి ఉంచాలి.

అప్పుడు చీడపీడల బెడద ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube