లక్ష్యం చేరుకోవడానికి మెడిటేషన్ అవసరం

సూర్యాపేట జిల్లా:జిల్లా యంత్రాంగం,జిల్లా పోలీసు అధ్వర్యంలో ఉచిత శిక్షణలో ఉన్న ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు 3 రోజుల పాటు మెడిటేషన్ తరగతులను నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ,విజయ్ ఫంక్షన్ హాల్ లో హర్ట్ ఫుల్ నెస్ ధ్యానకేంద్రం,సూర్యాపేట వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడిటేషన్ తరగతులను ఎస్పీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత శిక్షణలో ఉన్న అభ్యర్థులకు ఉద్యోగ సాధనలో ఈ మెడిటేషన్ ఉపయోగ పడుతుందని అన్నారు.మెడిటేషన్ నిచ్చలమైన మనసు,ఏకాగ్రత కలిగి ఉంటుందని,మనసు, ఆలోచనలు ప్రశాంతంగా ఉంటే చదువుపై ఏకాగ్రత పెరుగుతుందన్నారు.

మెడిటేషన్ చేయడం వల్ల ఇది సాధ్యం అవుతుందన్నారు.మూడు రోజుల పాటు ఈ తరగతులు ఉంటాయని,అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఆర్ఐలు శ్రీనివాస్, గోవిందరావు,నర్సింహారావు,ఎస్ఐ వీరన్న,ఆర్ఎస్ఐలు సాయి,సురేష్,రాజశేఖర్,అశోక్,రెహమాన్,సిబ్బంది, హార్ట్ ఫుల్ నెస్ ధ్యానకేంద్ర మెడిటేషన్ శిక్షకులు గోవర్ధన్ గిరి,సుధారాణి,యువత పాల్గొన్నారు.

Advertisement
ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

Latest Suryapet News