Suryapet : గంజాయి,మత్తు పదార్థాలతో మందుల తయారీ…!

ప్రాణం సుస్తీ చేస్తే డాక్టర్( Doctor ) దగ్గరికి వెళ్లి ఆయన రాసిన మందులు కొనుక్కొని వేసుకుంటాం.

కొందరైతే నేరుగా మెడికల్ షాపుకు వెళ్ళి తమ సమస్య చెప్పి మందులు తెచ్చుకుంటారు.

ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ ఏదో ఒక దశలో మెడిసిన్ తప్పకుండా వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రాణాలను కాపాడాల్సిన ఔషధాలు అల్లోపతి, హోమియోపతి వంటి వాటిల్లో ప్రజలకు దొరుకుతున్నాయి.

కానీ,గంజాయితో తయారయ్యే మందులు మాత్రం సూర్యాపేట జిల్లా కోదాడ( Kodada ), హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలో దొరకడం అందరినీ ఆశ్చర్యానికి గురుచేస్తుంది.గంజాయి బ్యాచ్ బరితెగించి చివరికి చిన్న పిల్లలు తాగే టానిక్ లు( Tonics Made from Cannabis ) కూడా మత్తు పదార్థాలు,గంజాయి కలిపి తయారు చేస్తూ పసి ప్రాణాలను హరించే కుట్రకు కొందరు కేటుగాళ్లు తెరతీశారు.

నకిలీ మందుల సమాచారం అందుకున్న డ్రగ్స్ మరియు ఎక్సైజ్ అధికారులు బుధవారం హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో నిర్వహించిన దాడుల్లోవిస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి రావడంతో అధికారులే షాక్ కు గురయ్యారు.మఠంపల్లి మండల కేంద్రంలోని న్యూ దుర్గ భవాని మెడికల్ షాప్ యజమాని తన ఇంటిలో tossex సిరఫ్ 100 ఎంఎల్ 80,nitravet 10 ఎంజి టాబ్లెట్స్10షీట్స్, ప్రతి సీట్ లో 15 టాబ్లెట్స్ మొత్తం 150 టాబ్లెట్స్ ను తయారు చేస్తుండగా డ్రగ్స్ మరియు ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించి టాబ్లెట్స్( Tablets ) లను స్వాధీనం చేసుకుని,అతనికి అరెస్ట్ చేసిన విషయం జిల్లాలో కలకలం రేపుతోంది.

Advertisement

తదుపరి వారు నకిలీ మందులు( Fake Medicines ) సప్లై చేసిన కోదాడలోని శ్రీ వెంకటసాయి సర్జికల్ అండ్ మెడికల్ డిస్ట్రిబ్యూషన్, సాయిదుర్గ ఫార్మా డిస్ట్రిబ్యూషన్లపై దాడులు( Saidurga Pharma Distributions ) చేసి అమ్మకాల వివరాలు సేకరించి దానికి సంబంధించిన పూర్తి సమాచారం సమర్పించవలసిందిగా నోటీసులు జారీ చేయడం జరిగింది.జిల్లాలో యువకులు గంజాయి,మత్తు పదార్థాలు అలవాటుపడి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు.

జిల్లాలో ప్రతీ రోజు ఎక్కడో ఓ చోట గంజాయి వాసన వస్తూనే ఉంది.చివరికి ప్రజల ప్రాణాలు కాపాడే మందుల్లో కూడా గంజాయి కలిపి నకిలీ మందులు తయారు చేయడం జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది.

ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని,ఈ నకిలీ మందుల ముఠా వెనుకాల దాగి ఉన్న వారిని బయటికి తీయాలని ప్రజలు కోరుతున్నారు.

చిన్న కుటుంబం నుండి చికాగో నగరానికి...!
Advertisement

Latest Suryapet News