ఉమ్మడి నల్లగొండ జిల్లా -4 హుజూర్ నగర్ లో తొలి నామినేషన్ వేసిన ఎంసీపీఐ(యు) అభ్యర్ధి

సూర్యాపేట జిల్లా:ఈ నెల మూడు నుండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే.

మూడు రోజులైనా సూర్యాపేట జిల్లా( Suryapet District ) హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఒక్క నామినేషన్ కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

నాల్గవ రోజు సోమవారం ఎంసీపీఐ(యు) అభ్యర్ధిగా వసకుల సైదమ్మ హుజూర్ నగర్ లోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జగదీశ్వర్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు.దీనితో హుజూర్ నగర్ లో తొలి నామినేషన్ గా సైదమ్మ నామినేషన్ రికార్డ్ అయిందని రిటర్నింగ్ అధికారి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించారు.

MCPI(U) Candidate Filed First Nomination In Joint Nalgonda District-4 Huzur Naga
పింఛన్ల కోసం పొద్దంతా పడిగాపులు...!

Latest Suryapet News