సాధారణంగా ప్రజల్లో పోలీసులపై( Police ) ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది.వారు ప్రజలపై అనవసరంగా చేయి చేసుకుంటారని, న్యాయంగా అందరినీ అనగదొక్కడానికి చూస్తారని ఒక చెడు అభిప్రాయం ఉంది కానీ పోలీసుల్లో కూడా మంచి హృదయం ఉన్నవాళ్లు చాలామంది ఉంటారని ఇప్పటికే ఎన్నో ఘటనలు చెప్పకనే చెప్పాయి.
ఇప్పుడు ఆకువకు చెందిన మరొక ఘటన వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే, ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం( Puri Jagannath Temple ) వద్దకు చేర్చేందుకు ఓ వృద్ధురాలిని( Old Woman ) తన చేతుల్లో ఎత్తుకెళ్లాడో ఓ పోలీసు.
ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మహిళ ఆలయ సముదాయం చుట్టూ ఎక్కువ దూరం నడవలేకపోయింది, కాబట్టి ఆమెను పైకి లేపి మందిరం ప్రవేశ ద్వారం వద్దకు తీసుకెళ్లడం ద్వారా ఆమెకు సహాయం చేయాలని పోలీసు నిర్ణయించుకున్నాడు.
పవిత్ర కార్తీక మాసంలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులను జాగ్రత్తగా చూసుకుంటున్నామని పూరి పోలీసులు ఎక్స్ ప్లాట్‌ఫామ్ వీడియోలో తెలిపారు.జగన్నాథుని ఆరాధనకు కార్తీకం అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు.చాలా మంది భక్తులు( Devotees ) ఆయన అనుగ్రహం కోసం ప్రత్యేక ఆచారాలు, ఉపవాసాలను పాటిస్తారు.
పోలీసు దయతో వృద్ధురాలిని చేతల్లో తీసుకెళ్లిన చర్యను నెటిజన్లు విస్తృతంగా ప్రశంసించారు, వారు అతని సేవను ప్రశంసించారు.యాత్రికుల భద్రత, సౌకర్యాన్ని నిర్ధారించడానికి పూరి పోలీసులు చేసిన కృషికి కొందరు నెటిజన్లు సెల్యూట్ చేశారు.వీడియో 16,000 కంటే ఎక్కువ వ్యూస్ పొందింది.
వివిధ ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయడం జరిగింది.