టార్గెట్ జగన్ : మూకుమ్మడి రాజకీయ దాడితో జగన్ ఉక్కిరిబిక్కిరి

రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు మాములుగా ఉండవు.ఒక పార్టీని మించి మరో పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ తమ రాజకీయం నడుపుతుంటాయి.

అవసరం అయితే ఒక పార్టీ అధికారంలోకి రాకుండా చేయడానికి మరో పార్టీతో అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకుని మరీ రాజకీయం చేయడానికి వెనుకాడవు.ఇప్పుడు ఏపీ ఎన్నికల్లోనూ అదే జరుగుతోంది.

ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ గా చేసుకుని టీడీపీ, జనసేన, ప్రజాశాంతి తదితర పార్టీలన్నీరాజకీయం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.పైకి చెప్పకపోయినా వైసీపీ టార్గెట్ గా మిగతా పార్టీలన్నీ ఏకమయ్యాయా అనే అనుమానం ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతోంది.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేలా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు మద్దతు ఇస్తున్నాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదేపదే ఆరోపణలు చేస్తున్నారు.అయితే, వారు జగన్ కు ఎక్కడా బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు.

Advertisement

బీజేపీ అన్ని స్థానాలకూ అభ్యర్థులను పోటీలోకి దించింది.ఇక కేసీఆర్ మద్దతు ఉన్నా లేకపోయినా ఏపీలో జగన్ కలిగే ప్రత్యేక మేలు ఏమీ ఉండదు.

ఇదే సమయంలో వీరిద్దరితో జగన్ కుమ్మక్కయ్యారని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నికల్లో లాభపడాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు .మోదీ, కేసీఆర్, జగన్ లాలూచీపడ్డారనే విషయాన్ని టీడీపీ ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకుంది.

టీడీపీ చేస్తున్న ఆరోపణలనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆరోపిస్తున్నారు .టీడీపీ మీద విమర్శలు కట్టిబెట్టి జగన్ టార్గెట్ గా తన రాజకీయ విమర్శలు చేయడం అందరిలోనూ ఆలోచన రేకెత్తిస్తోంది.జనసేన టీడీపీ విడివిడిగానే పోటీ చేస్తున్నా అసలు టార్గెట్ అంతా జగన్ అన్నట్టుగానే ఇరు పార్టీల అధినేతలు ప్రవర్తిస్తున్నారు .ఈ అనుమానాలకు మరింత బలం రేకెత్తించేలా కేఏ పాల్ ఆధ్వర్యంలోని ప్రజాశాంతి పార్టీ కూడా జగన్ టార్గెట్ గానే రాజకీయంలోకి దిగినట్టు కనిపిస్తోంది.అందుకే వైసీపీ జెండా పోలిన విధంగానే ఆ పార్టీ జెండా ఉండడం వైసీపీ ఫ్యాన్ గుర్తును గందరగోళం చేసేలా హెలికాఫ్టర్ గుర్తు ఎంపిక చేసుకోవడం, వైసీపీ అవ్భ్యర్థులు నామినేషన్ వేసిన చోట అదే పేరు ఉన్న వ్యక్తులతో నామినేషన్ వేయించడం ఇవన్నీ అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

లండన్ చేరుకున్న ఏపీ సీఎం జగన్..!!
Advertisement

తాజా వార్తలు