మనిషికి పిచ్చి పలు రకాలుగా ఉంటుంది.ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన పిచ్చి ఉంటూనే ఉంటుంది.
కొందరికి సంగీతం పిచ్చి ఉంటే, మరి కొందరికి పుస్తకాల పిచ్చి ఉంటుంది.అయితే ఆ పిచ్చి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు.
కాని కొందరు వాస్తు పిచ్చితో ఉంటారు.అలాంటి వారు ఎక్కడకు వెళ్లినా, ఏం చేసినా కూడా వాస్తూ చూస్తూ ఉంటారు.
వాస్తు కారణంగా కోట్ల రూపాయల విలువ చేసే భవనాలు, ఆస్తులను కూడా లక్షలకు అమ్ముకున్న వారిని మనం గతంలో చూశాం.కాని ముంబయిలో తాజాగా 11 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను రూపాయి కూడా తీసుకోకుండా తిరిగి ఇచ్చేశాడో ఒక వ్యక్తి.
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న ఆ వ్యక్తి వాస్తు పిచ్చికి ఇది పరాకాష్ఠ అని చెప్పుకోవచ్చు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని శివసేన పార్టీ నాయకుడు అయిన వినోద్ షిర్కే అనే వ్యక్తికి అద్బుతమైన లాటరీ తగిలింది.
లక్షలాది మంది ఎదురు చూసిన ఆ లాటరీ వినోద్‌కు దక్కడంతో ఆయన కూడా చాలా సంతోషించాడు.

ఒకే సారి రెండు లాటరీలు కూడా తనకే దక్కడంతో ఆయన ఆనందానికి అవదులు లేకుండా పోయింది.ఆయన సంతోషంతో ఎగిరి గంతేశాడు.తనకు వచ్చిన రెండు ఫ్లాట్‌లను సొంతం చేసుకుని వాటిలో ఒకటి అమ్ముకు, వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకున్నాడు.
ఎన్నో రకాలుగా అనుకున్న అతడు ఆ రెండు ప్లాట్‌లను వాస్తు పండితుడికి చూపించడం జరిగింది.

వాస్తు పండితుడు ఆ రెండు ప్లాట్లు కూడా సరైన వాస్తుకు లేవని, వాటిని తీసుకుంటే రాజకీయ కెరీర్ నాశనం అవుతుందని హెచ్చరించాడట.పలు మార్పులు చేర్పులు చేసిన తర్వాత తీసుకోమని చెప్పాడట.ఆ ప్లాట్‌లకు మార్పులు చేర్పులు చేసినా కూడా తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందేమో అని వినోద్ ఆ రెండు ప్లాట్లు కూడా వద్దని లాటరీ నిర్వాహకులకు చెప్పాడట.
రెండు ప్లాట్లు కూడా వద్దని చెప్పడంతో సదరు సంస్థ వారు మరోసారి లాటరీ తీయడం జరిగింది.ఈసారి ఇద్దరికి రెండు ప్లాట్లు చెరోటి చొప్పున దక్కాయి.మొత్తానికి 11 కోట్ల విలువ చేసే ప్లాట్‌లను వాస్తు దోషం చూపించి వదిలేసిన ఆ వ్యక్తి గురించి తెలుసుకునేందుకు దేశ వ్యాప్తంగా నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు.