వడదెబ్బతో వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల పరిధిలోని కొత్త గోల్ తండా గ్రామానికి చెందిన బానోతు మంగ్యా (40) శనివారం వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

రోజు వారీ కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగించే మంగ్యా శుక్రవారం కూలీ పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చి స్పృహ తప్పి పడిపోయాడని,ఎండ తీవ్రతకు వడదెబ్బ తగలడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించినట్లు చెప్పారు.

మృతునికి భార్య,ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన పేద కుటుంబంలో విషాదం అలుముకుంది.

Man Dies Of Sunburn , Banothu Mangaya , Sunburn , Labor Works-వడదెబ�
కానిస్టేబుల్ రాంబాబు మృతి బాధాకరం : ఎస్పీ నరసింహ

Latest Suryapet News