డీసీఎం బైక్ ఢీ కొన్న ఘటనలో వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామ సమీపంలోకోదాడ-మిర్యాలగూడ ప్రధాన రహదారిపై గౌరీ శంకర్ రైస్ ఇండస్ట్రీస్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళుతున్న నేరేడుచర్ల పట్టణానికి చెందిన సెంట్రింగ్ వర్కర్ షేక్ యూసుఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు సెంట్రింగ్ పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై మిర్యాలగూడ( Miryalaguda ) వెళుతుండగా మూల మలుపులో ఎదురుగా వస్తున్న డీసీఎం బైక్ ను ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద తీవ్రతను పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు.డీసీఎం డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు.

Man Dies In Collision With DCM Bike , Kodada-Miryalaguda, Accident, Man Died,

Latest Suryapet News