మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలి:బీసీ విద్యార్థి సంఘం

సూర్యాపేట జిల్లా:పేద,బడుగు,బలహీనవర్గాల విద్యార్థుల నుంచి డొనేషన్ల పేరుతో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న మంత్రి మల్లారెడ్డిని మంత్రివర్గం నుంచి వెంటనే భర్తరఫ్ చేయాలని బీసీ విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు వీరబోయిన లింగయ్య యాదవ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శనివారం జిల్లా కేంద్రంలోని బీసీ సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక పాల వ్యాపారిగా వచ్చి ఒక ప్రభుత్వాన్ని నడిపే స్థాయి వరకు ఎదిగినటువంటి మంత్రి మల్లారెడ్డి రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉండటం రాజ్యాంగానికి అవమానమని అన్నారు.

మల్లారెడ్డికి చెందిన 31విద్యాసంస్థల అవినీతి,అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలని,లేని పక్షంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో జనసేన సమితి రాష్ట్ర అధ్యక్షులు తగుల జనార్ధన్,జటంగి మహేష్,ఉప్పుల అశోక్,వేల్పుల శ్రీను,వంశీ,సాయి,మధుసూధన్,మహేష్, గణేష్,రాజు,విక్రమ్,గణపతి,వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Mallareddy Should Be Removed From The Post Of Minister: BC Student Union-మల�
అనిల్ రావిపూడి అనుకున్న టైమ్ కి చిరంజీవి సినిమాను రిలీజ్ చేస్తాడా..?

Latest Suryapet News