కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభను విజయవంతం చేయండి

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ ఈనెల 17న హైదరాబాద్ లోని తుక్కుగూడలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించ తలపెట్టిన విజయ భేరి సభను విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.

60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఈ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారని,అదే విధంగా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే, భావి భారత ప్రధాని యువనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ అతిరథ మహారధులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శుభ సందర్భంగా గంభీరావుపేట మండలం నుంచి అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరీ ముఖ్యంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ కి కృతజ్ఞతలు తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పాపా గారి రాజు గౌడ్, కొత్తపల్లి గ్రామ అధ్యక్షుడు మేడా భాస్కర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు గుర్రం రాజా గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజా బోయిన లచ్చయ్య, మొహమ్మద్ యాదుల్లా, గుడి కాడి కుమార్,మహమ్మద్ రావు, యూత్ కాంగ్రెస్ నాయకులు మహేందర్, వంశీ, అప్సర్ తదితరులు పాల్గొన్నారు.

Make Congress Party Vijayabheri Sabha A Success, Congress Party Vijayabheri Sabh
కుబేర పాన్ ఇండియాలో వర్కౌట్ అవుతుందా..?

Latest Rajanna Sircilla News