డాక్టర్.శ్రీదేవి రచించిన ప్రసిద్ధ నవల కాలాతీత వ్యక్తులు ప్రేరణతో తెరకెక్కిన సినిమా చదువుకున్న అమ్మాయిలు.1963లో వచ్చిన ఈ సినిమాలో సావిత్రి, కృష్ణకుమారి, ఇ.వి.సరోజ మెయిన్ రోల్స్ చేశారు.ఇందులో సావిత్రి, కృష్ణకుమారి ఇద్దరూ ఏఎన్నార్ ను లవ్ చేస్తారు.
అక్కినేనికి మాత్రం కృష్ణకుమారి అంటేనే చాలా ఇష్టం.చివరకు తను ఏఎన్నార్ ను కాదని పోలీస్ ఇన్స్పెక్టర్ శోభన్ బాబును పెళ్లి చేసుకుంటుంది సావిత్రి.
అలా సినిమా కథ కొనసాగుతుంది.పలు మలుపులతో ముందుకు సాగుతుంది.
ఈ సినిమా సమయంలో సావిత్రి కాస్త తెలివిగా వ్యవహరించింది.నిజానికి సావిత్రి.కృష్ణకుమారి, ఇ.వి.సరోజ కంటే కాస్త పొడవు తక్కువగా ఉంటుంది.ఆ ముగ్గురిలో తన పొట్టిగా కనిపించకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంది.
అంతేకాదు.ఓ మంచి ప్లాన్ వేసింది.
సావిత్రి వెంట దాక్షాయణి అనే ఓ అమ్మాయి ఉండేది.తను ఎప్పుడూ సావిత్రితో పాటే ఉండేది.
సావిత్రికి సంబంధించిన పలును చూసేది.మేకప్ తో పాటు ఎప్పుడు ఏ నగలు సావిత్రి ధరించిందో రాసి పెట్టేది.
అంతేకాదు.సావిత్రి కట్టుకున్న చీర, పెట్టుకున్న అభరణాలు, జుట్టుకు సంబంధించిన అలంకరణ సహా అన్ని విషయాలు నోట్ చేసేది.
అయితే చదువుకున్న అమ్మాయిలు సినిమాలో సావిత్రి, కృష్ణకుమారి, సరోజ కలిసి వుండే షాట్స్ లెక్కకు మించి ఉన్నాయి.వాళ్లిద్దరికంటే తాను పొడవు తక్కువ.అందుక తను సింగపూర్ నుంచి తెప్పించుకున్న హైహీల్స్ వాడేది సావిత్రి.సెట్స్ మీద ఎప్పటికప్పుడు షాట్స్ గమనిస్తూ ఉండేది దాక్షాయణి.ఆ ముగ్గురి షాట్స్ ఎప్పుడు తీస్తున్నా.చడీ చప్పుడు లేకుండా సావిత్రి దగ్గరికి ఆ హైహీల్స్ తీసుకొచ్చేది.
వాటిని వేసుకోవాలని చెవిలో చెప్పి వెళ్లిపోయేది.ఆమె చెప్పగానే సావిత్రి వాటిని ధరించేది.
మిగతా ఇద్దరితో పోల్చితే పొట్టిగా కనిపించకుండా జాగ్రత్త పడేది.మొత్తంగా దాక్షాయణి మూలంగా సావిత్రి ఎత్తు బయటకు తెలియకుండా ఉండిపోయింది.
సావిత్రి ప్లాన్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది.