లారీ ట్రాక్టర్ ఢీ ట్రాక్టర్ బోల్తా,పెద్ద గొయ్యిలో పడ్డ లారీ

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం కీతవారిగూడెం సమీపంలో ట్రాక్టర్,లారీ ఢీ కొన్న ఘటనలో ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీ ఒకచోట,ట్రాక్టర్ ఇంజన్ మరో చోట పడ్డాయి.

లారీ జాతీయ రోడ్డు పనులు చేస్తున్న పెద్ద గోతిలో దూసుకొని పోయింది.

ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.ఇక్కడ రహదారి విస్తరణ పనులు జరుగుతుండగా ఇరుకు వంతెన వద్ద కనీసం ప్రమాద సూచిక బోర్డులు పెట్టకపోవడం,ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్...!

Latest Suryapet News