గణపతి బప్పా మోరియా అంటున్న బంగ్లా క్రికెటర్..

ప్రపంచవ్యాప్తంగా మన హిందూ దేవతలు, దేవుళ్ళు ప్రత్యేక పూజలు అందుకోవడం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో విదేశీయులు, ఇతర మతస్తులు కూడా మన హిందూ సంప్రదాయాలను పాటించడం మొదలు పెట్టేసారు.

 Litton Das Celebrates Ganpati Festival With Family , Litton Das, Ganesh Chaturth-TeluguStop.com

అయితే విదేశాలలో కూడా విదేశీ పండితులు కూడా ఉండడం, అలాగే శాస్త్రాలు నేర్చుకొని పురోహిత పనులు చేయడం మనం చూస్తూనే ఉంటాం.తాజాగా వినాయక చవితి ( Ganesh Chaturthi )వేడుకలలో సినీ తారల సందడి మనం చూసాం.

అయితే తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్ మన హిందూ పండుగ అయిన వినాయక చవితి పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది.

బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్( Liton Das ) కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.అందుకు సంబంధించిన ఫోటోలు క్రికెటర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.లిటన్ దాస్ సోషల్ మీడియా( Social media ) వేదికగా పోస్ట్ చేస్తూ “గణపతి బప్పా మోరియా” అంటూ క్యాప్షన్ జత చేసి తన కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోలను ట్యాగ్ చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఫోటోలను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.కొందరైతే మొత్తానికి బంగ్లాదేశ్లో ( Bangladesh )హిందువులు ప్రస్తుతం సేఫ్ గా ఉన్నారని కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే మీలాంటి వారి వల్ల బంగ్లాదేశ్లో హిందువులు ఇంకా క్షేమంగా ఉన్నారని తెలుస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube