శ్రీకాంతాచారి అషయసాధనకై పోరాడుదాం

సూర్యాపేట జిల్లా:తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి ఆశయసాధనకై పోరాడాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ సభ్యులు గట్ల రమాశంకర్ పిలుపునిచ్చారు.

శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా శనవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ జనసమితి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీకాంతాచారి లాంటి ఎంతోమంది యువకుల బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యమ ఆకాంక్ష కూడా నెరవేరడం లేదని,అమరుల త్యాగాలు అవహేళన చేయబడుతున్నవని,అమరుల త్యాగాలపై గద్దె నెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ అమరుల ఆకాంక్షలను పట్టించుకోకుండా కుటుంబ,అవినీతి పాలన సాగిస్తున్నారని విమర్శించారు.అమరుల స్ఫూర్తితో ప్రజాస్వామిక తెలంగాణ సాధనకై తెలంగాణ జనసమితీ పోరాడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాండ్ర మల్లయ్య, యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాబోయిన కిరణ్,పట్టణ పార్టీ అధ్యక్షుడు దొన్వాన్ బంధన్ నాయక్, మైనార్టీ సెల్ నాయకులు అక్తర్ దోన్వాన్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News