ఇంటర్ ప్రశ్నాపత్రాల లీకేజీ పునరావృత్తం కాకుండా చూడాలి: బీఎ

సూర్యాపేట జిల్లా:త ప్రభుత్వం ఇంటర్ ప్రశ్నాపత్రాలలో చేసిన తప్పులు ఈ ప్రభుత్వంలో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి రాపోలు నవీన్ కుమార్ ( Rapolu Naveen Kumar )అన్నారు.

ఆదివారం సూర్యపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు జిలకర రామస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న జరిగే ఇంటర్ పరీక్ష పేపర్ లీకేజీలు( Inter exam paper leakages ) లేకుండా సజావుగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వం ప్రశ్నాపత్రాలలో తప్పులతో పాటు అనేక పొరపాట్ల చేసి విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకున్నదని మండిపడ్డారు.ప్రైవేట్ కళాశాలలో ఆర్థికంగా వెనుకబడి చదువుతున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ అగ్రవర్ణ పేదల పట్ల అక్రమంగా అధికంగా ఫీజులు వసూలు చేసి ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు( BSP leaders ),కార్యకర్తలు పాల్గొన్నారు.

పిల్లలకు మద్యం,పొగాకు ఉత్పత్తులు అమ్మవద్దు : ఎస్పీ రాహుల్ హెగ్డే
Advertisement

Latest Suryapet News