పల్నాడులో ‘జగనన్న విద్యాకానుక పథకం’ ప్రారంభం

పల్నాడు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు.ఇందులో భాగంగా పెదకూరపాడు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.

ముందుగా పెదకూరపాడు నియోజకవర్గానికి వెళ్లనున్న ఆయన జగనన్న విద్యాకానుక పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.తరువాత క్రోసూరులో విద్యాకానుక కిట్లను సీఎం జగన్ పంపిణీ చేయనున్నారు.రూ.1,042 కోట్లతో 43 లక్షల మంది విద్యార్థులకు కిట్లను అందజేయనున్నారు.కాగా ఏపీ ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యాకానుకను అందిస్తున్న సంగతి తెలిసిందే.

Launch Of 'Jagananna Vidyakanuka Scheme' In Palnadu-పల్నాడులో
జియో సైకిల్ : ఒకసారి ఛార్జ్ చేసారంటే 80 కి.మీ ఏకధాటిగా చుట్టి రావచ్చు!

Latest Latest News - Telugu News