పండుగలు వస్తే సగం ఊరు కరెంటే ఉండదు... లో ఓల్టేజ్ సమస్యతో కొప్పోల్ ఇక్కట్లు

నల్లగొండ జిల్లా: గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల లో ఓల్టేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతుర్రు.

నిత్యం రాత్రి సమయాల్లో ప్రజలు ఫ్యాన్లు,ఏసీలు పని చేయక విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే విషయమై గత ఐదు నెలల క్రితం రాత్రి సమయంలో లో ఓల్టేజ్ కారణంగా విద్యుత్ కి అంతరాయం కలగగా, స్థానిక విద్యుత్ అధికారులపై దాడులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.ప్రభుత్వాలు మారినా గ్రామంలో విద్యుత్ సమస్యలు మాత్రం తీరట్లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Koppole Was Troubled By The Problem Of Low Voltage, Koppole , Low Voltage, Curre

ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి లో ఓల్టేజ్ సమస్య తీర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కులం పేరుతో దూషించిన ముగ్గురికి ఆరు నెలలు జైలు శిక్ష
Advertisement

Latest Nalgonda News