కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండాపూర్ వెంకట్రావుపేట ఎంపీటీసీ పల్లె మంజుల రవీందర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్,వెంకట్రావుపేట ఎంపీటీసీ పల్లె మంజుల రవీందర్ రెడ్డి, వెంకట్రావుపేట బీఆర్ఎస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకుపల్లి నరసింహారెడ్డి, మాజీ వార్డు సభ్యులు చెరుకుపల్లి సుజాత భీమ్ రెడ్డి లు బుధవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని వాపోయారు.కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలో చేరడం జరిగిందన్నారు.

Kondapur Venkatraopeta MPTC Palle Manjula Ravinder Reddy Joined Congress Party,

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.అందరం కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి,మాజీ సర్పంచ్ జిల్లా కార్యదర్శి నాలుక సత్యం,యూత్ అధ్యక్షులు నాలుక వేణు , శ్రీకాంత్ , మల్లయ్య తదితరులు ఉన్నారు.

Advertisement
ప్రభాస్ కు సందీప్ రెడ్డి వంగా విధించిన షరతులు ఇవే.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Latest Rajanna Sircilla News