చినుకు పడితే చిత్తడే..

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణంలోని 19,26 వార్డుల్లో ఇటీవల కురిసిన వర్షానికి మట్టి రోడ్డు కాస్త అస్తవ్యస్తంగా మరి,చినుకు పడితే చాలు రోడ్లన్ని చిత్తడి అవుతున్నాయని వార్డుల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మట్టి రోడ్లపై గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందిగా మారిందని, పాదచారులు కూడా అడుగు తీసి పడుగేసే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు.

వాహనదారులు ఇటుగా వెళ్లడమే మర్చిపోయారని, అంతలా ప్రమాదకరంగా ఉన్న ఈ రోడ్డును ఎవరు పట్టించుకోకపోవడంపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భవాని నగర్ నుండి ఎమ్మెస్ కాలేజీ వరకు చిరుజల్లు పడితే చాలు నడవలేక ప్రజల,వాహనదారులు అవస్థలు పడుతున్నారని, వార్డు కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్, కమిషనర్ ఇళ్ళ ముందు కూడా ఇలాగే ఉంటే తిరిగే వాళ్ళా అని ప్రశ్నిస్తున్నారు.

Kodad Bhavani Nagar Colony People Facing Problems With Mud Road Due To Heavy Rai

సిసి రోడ్డు వేస్తేనే మా ఇంటికి ఓటు అడగడానికి రండి.లేదంటే రాకండి అని భవాని నగర్ కాలనీవాసులు అంటున్నారు.

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని, నీళ్ళు నిల్వ ఉన్న ప్రదేశాల్లో బ్లీజింగ్ పౌడర్ చల్లడం లాంటివి చేయడం లేదని ఆరోపిస్తున్నారు.సిసి రోడ్డు వేస్తే ఈ పరిస్థితి ఉండదని,వెంటనే సిసి రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
అనిల్ రావిపూడి అనుకున్న టైమ్ కి చిరంజీవి సినిమాను రిలీజ్ చేస్తాడా..?

Latest Suryapet News