యువ హీరో కిరణ్ అబ్బవరం మంచి దూకుడు మీద ఉన్నాడని చెప్పొచ్చు.ఈమధ్యనే సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతను ఆ సినిమా రిలీజై నెల రోజులు కూడా కాకముందే మరో రెండు సినిమాల టీజర్ లను రిలీజ్ చేశాడు.
కిరణ్ అబ్బవరం హీరోగా వినరో భాగ్యము విష్ణు కథ, నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలు వస్తున్నాయి.హీరో బర్త్ డే సందర్భంగా వినరో భాగ్యము విష్ణు కథ టీజర్ నిన్ననే రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాలతో పాటుగా కిరణ్ అబ్బవరం మరో రెండు సినిమాలు చేస్తున్నాడు.వాటికి సంబందించిన పోస్టర్స్ కూడా ఈరోజు రిలీజ్ చేశారు.కిరణ్ అబ్బవరం హిరోగా రత్నం కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా రూల్స్ రంజన్.ఈ సినిమా పోస్టర్ కూడా కిరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాతో పాటుగా మీటర్ అనే సినిమా పోస్టర్ కూడా వచ్చింది.ఈ సినిమాను రమేష్ కదూరి డైరెక్ట్ చేస్తున్నారు.
కె.ఎస్ రవీంద్ర, గోపీచంద్ మలినేని దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన రమేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.
అంటే కిరణ్ అబ్బవరం ఇప్పుడు ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నాడన్నమాట.యువ హీరోగా కిరణ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంది అన్నది ఈ సినిమాల లిస్ట్ చూస్తేనే అర్ధమవుతుంది.రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన హీరోగా తన మార్క్ చూపించాలని చూస్తున్న కిరణ్ కి పరిశ్రమలో మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమాల టైటిల్స్ వెరైటీ పోస్టర్స్ కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
ఈ సినిమాలన్ని కూడా సక్సెస్ అయితే కిరణ్ అబ్బవరం నిజంగానే మరో స్టార్ గా ఎదిగే ఛాన్స్ ఉంటుంది.