ఖాకీ ఔదార్యం

సూర్యాపేట జిల్లా:ఓ నిరుపేద కుటుంబానికి ఎస్ఐ ఆర్థిక భరోసా.పిల్లల చదువులకు సహకరిస్తానని హామీ.

ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఇంటి యజమాని ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆ కుటుంబం దిక్కులేనిదైనది.విషయం తెలుసుకున్న ఓ ఎస్ఐ కుటుంబాన్ని సందర్శించి,కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయమందించి,పిల్లల చదువుల విషయంలో సహాయం చేస్తానని వారికి భరోసా ఇచ్చిన మానవత్వం మూర్తీభవించిన సంఘటన మోతె మండలం అన్నారిగుడెంలో శనివారం జరిగింది.

గ్రామానికి చెందిన కాంపాటి వెంకటేష్ (43) గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించాడు.ఆయనకు భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.

నిరుపేద కుటుంబం కావడంతో కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉండగా మోతె ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మానవతా దృక్పథంతో స్పందించి గ్రామానికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.అనంతరం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పిల్లల చదువులకు సహాయ చేస్తానని, మీరు అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు.

Advertisement

పోలీసులు అంటే తిట్టేవారు,కొట్టే వారు,కేసులు పెట్టే వారు, వేధించే వారే ఉండరని,వారిలో కూడా ఎంతోమంది దయార్ద్ర హృదయం గలవారు ఉన్నారని మరోసారి నిరూపించారు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో 2వ,వార్డు సభ్యులు కలకొండ చంటి,గోపి,చిన్న లక్ష్మీనర్సు, వీరబాబు,వెంకటేష్,శ్రీను,కరుణాకర్,చిన్న బాబు తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేట్ హెయిర్ సెలూన్స్ అడ్డుకోండి
Advertisement

Latest Suryapet News