మెగా 154 లో నాలుగు మాస్ సాంగ్స్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా 154వ మూవీ కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే.

 Four Mass Songs For Mega 154 Megastar Chiranjeevi Details, Chiranjeevi, Ks Ravin-TeluguStop.com

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు.సినిమాలో చిరుతో పాటుగా రవితేజ కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడం సినిమాకు మరింత క్రేజ్ తీసుకొస్తుందని చెప్పొచ్చు.

మెగా 154 మూవీకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు దేవి మ్యూజిక్ అంటే సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది.

అదే రేంజ్ లో మెగా 154 మూవీకి కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదరగొట్టేస్తాడని అంటున్నారు.ఈ సినిమాలో 4 ఊర మాస్ సాంగ్స్ ఉంటాయని తెలుస్తుంది.

సినిమా మొత్తం మీద నాలుగు సాంగ్స్ ఉంటాయని తెలుస్తుండగా ఆ సాంగ్స్ అన్ని మాస్ సాంగ్స్ గా వస్తున్నాయట.మాస్ సాంగ్స్ లో దేవి అదరగొట్టేస్తాడు. వాళ్తేర్ వీరయ్య టైటిల్ తో వస్తున్న ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి తన మాస్ స్టామినా ఏంటో చూపించనున్నారు.ఆచార్య నిరుత్సాపరచగా ఆ సినిమా ఫెయిల్యూర్ కి గల కారణాలన్ని తను తీసే మిగతా సినిమాలకు రిపీట్ అవకుండా జాగ్రత్త పడుతున్నాడు చిరంజీవి.

Telugu Bhola Shankar, Chiranjeevi, Devisri Prasad, God, Ks Ravindra, Mania, Mass

ఇప్పటికే లూసిఫర్ రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ కూడా క్రేజీగా రాబోతుంది.దసరా బరిలో దిగుతున్న గాడ్ ఫాదర్ మెగాస్టార్ రేంజ్ కి తగినట్టుగా ఉంటుందని అంటున్నారు.ఇక భోళా శంకర్ కూడా సిస్టర్ సెంటిమెంట్ తో వస్తున్నా తప్పకుండా మాస్ ఆడియెన్స్ ని మెప్పిస్తుందని అంటున్నారు.ఈ రెండు సినిమాల తర్వాత వస్తున్న ఈ వాళ్తేర్ వీరయ్య మెగా మాస్ మూవీగా రికార్డులు కొల్లగొడుతుందని చిత్రయూనిట్ చెబుతున్నారు.

రాబోతున్న ఈ సినిమాలతో మెగాస్టార్ తన స్టామినా ఏంటన్నది చూపించాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube