జాన్వీ దేవర కంటే ముందుగానే ఆ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉండేదా... ఏమైందంటే?

శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి జాన్వి కపూర్( Janhvi Kapoor ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే ఈమె ఎన్టీఆర్ ( NTR ) హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమా( Devara Movie ) ద్వారా టాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతున్నారు.అయితే దేవర సినిమా ద్వారా ఈమె సౌత్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారని భావిస్తున్నాం కానీ ఈమెకు ఇదివరకే ఓ టాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట.

 Janvi Kapoor Is The First Choice For Most Eligible Bachelor Movie Full Details H-TeluguStop.com

అయితే కొన్ని కారణాల వల్ల జాన్వీ ఆ సినిమాలో నటించే అవకాశాన్ని బోనీకపూర్ ( Boney Kapoor ) కల్పించలేదు.

Telugu Akhil, Devara, Janhvi Kapoor-Movie

ఇలా ఈమె ఇదివరకే నటించాల్సిన టాలీవుడ్ సినిమా మిస్ అవ్వడంతో ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీకి పరిచయం కాలేదు ఇక తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి ఈ సినిమా ద్వారా ఈమె సౌత్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.జాన్వీ కపూర్ కి ఇదివరకే ఏ హీరో సినిమాలో అవకాశం వచ్చింది ఎందుకు ఆ సినిమా అవకాశాన్ని వదులుకున్నారు అనే విషయానికి వస్తే.బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ ( Akhil ) హీరోగా నటించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్( Most Eligible Bacholer ) .ఈ సినిమాలో అఖిల్ పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించారు.

Telugu Akhil, Devara, Janhvi Kapoor-Movie

ఇక ఈ సినిమాలో ముందుగా నటి జాన్వీ కపూర్ కి అవకాశం వచ్చినప్పటికీ బోనీ కపూర్ మాత్రం ఈ సినిమాలో తన కుమార్తె నటించడానికి ఇష్టపడటం లేదట.అప్పటివరకు వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్నటువంటి అఖిల్ సినిమా పై ఏమాత్రం నమ్మకం లేకపోవడంతోనే బోనీ కపూర్ ఈ సినిమాలో తన కుమార్తె నటించదని చెప్పేసారట.ఇలా ఈమె తప్పుకోవడంతో పూజా హెగ్డే ( Pooja Hedge ) ఈ సినిమాలో భాగమయ్యారు.

అయితే అఖిల్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పరవాలేదు అనిపించింది కానీ ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటించకపోవడమే మంచిది అయింది అంటూ శ్రీదేవి ఫాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube