జాన్వీ దేవర కంటే ముందుగానే ఆ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉండేదా… ఏమైందంటే?

శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి జాన్వి కపూర్( Janhvi Kapoor ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే ఈమె ఎన్టీఆర్ ( NTR ) హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమా( Devara Movie ) ద్వారా టాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతున్నారు.

అయితే దేవర సినిమా ద్వారా ఈమె సౌత్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారని భావిస్తున్నాం కానీ ఈమెకు ఇదివరకే ఓ టాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట.

అయితే కొన్ని కారణాల వల్ల జాన్వీ ఆ సినిమాలో నటించే అవకాశాన్ని బోనీకపూర్ ( Boney Kapoor ) కల్పించలేదు.

"""/" / ఇలా ఈమె ఇదివరకే నటించాల్సిన టాలీవుడ్ సినిమా మిస్ అవ్వడంతో ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీకి పరిచయం కాలేదు ఇక తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి ఈ సినిమా ద్వారా ఈమె సౌత్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

జాన్వీ కపూర్ కి ఇదివరకే ఏ హీరో సినిమాలో అవకాశం వచ్చింది ఎందుకు ఆ సినిమా అవకాశాన్ని వదులుకున్నారు అనే విషయానికి వస్తే.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ ( Akhil ) హీరోగా నటించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్( Most Eligible Bacholer ) .

ఈ సినిమాలో అఖిల్ పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించారు. """/" / ఇక ఈ సినిమాలో ముందుగా నటి జాన్వీ కపూర్ కి అవకాశం వచ్చినప్పటికీ బోనీ కపూర్ మాత్రం ఈ సినిమాలో తన కుమార్తె నటించడానికి ఇష్టపడటం లేదట.

అప్పటివరకు వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్నటువంటి అఖిల్ సినిమా పై ఏమాత్రం నమ్మకం లేకపోవడంతోనే బోనీ కపూర్ ఈ సినిమాలో తన కుమార్తె నటించదని చెప్పేసారట.

ఇలా ఈమె తప్పుకోవడంతో పూజా హెగ్డే ( Pooja Hedge ) ఈ సినిమాలో భాగమయ్యారు.

అయితే అఖిల్ గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా పరవాలేదు అనిపించింది కానీ ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటించకపోవడమే మంచిది అయింది అంటూ శ్రీదేవి ఫాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దయచేసి నిజాయితీతో ఉండండి… సంచలనంగా మారిన సమంత పోస్ట్?