కేఆర్కే జోష్యం నిజమవ్వనుందా.. 'నిక్‌ జోనస్‌ వైఫ్‌' అన్నందుకు ప్రియాంక చోప్రా ఫైర్‌?

ప్రపంచ సుందరి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.ఎందుకంటే అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

 Is Krk Astrology Is Real Priyanka Chopra Fired For Saying Nick Jonas Wife Detail-TeluguStop.com

పైగా మోడల్ రంగంలో గ్లామరస్ బ్యూటీగా ప్రపంచ సుందరి కిరీటాన్ని కూడా దక్కించుకుంది.

నిజానికి ప్రియాంక చోప్రా నటిగా కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయంలోనే బాగా పరిచయం పెంచుకుంది.

ఏదో ఒక విషయం తో బాగా హాట్ టాపిక్ గా మారుతుంది ప్రియాంక.ఇక ఈమె 2018లో అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

నిజానికి నిక్ జోనస్ తన కంటే వయసులో చాలా చిన్నవాడు.

అలా తనకంటే చిన్న వాడిని పెళ్లి చేసుకొని అందరి దృష్టిలో పడింది.

ఇక పెళ్లి తర్వాత భర్తతో బాగా సంతోషంగా గడిపింది.అతడితో దిగిన ఫోటోలు బాగా పంచుకుంది.

తనకంటే చిన్న వాడిని పెళ్లి చేసుకున్నందుకు తన కుటుంబ సభ్యుల అభ్యంతరాలు కూడా లేవని గతంలో తానే తెలిపింది.పైగా నిక్ జోనస్ పెళ్లి విషయంలో బాగా తొందర పెట్టాడని కూడా తెలిపింది.

కానీ మేము సంతోషంగా ఉన్నాము అంటూ అప్పుడప్పుడు తాము గడిపిన అద్భుతమైన క్షణాలను కూడా అభిమానులతో పంచుకుంది.అంత అన్యోన్యంగా ఉండే ఈ జంట బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా క్యూట్ కపుల్ గా నిలిచింది.

కానీ అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదు గానీ వీరిద్దరూ ఇటీవలే విడాకులు తీసుకుంటున్నట్లు బాగా వార్తలు వినిపించాయి.

Telugu Bollywood, Divorce, Kamal Khan, Krk Joshyam, Matrix, Nick Jonas, Priyaka

సమంత, నాగ చైతన్యలు విడిపోయిన తరవాతే బాలీవుడ్  లో ప్రియాంక, జోనస్ ల విడాకుల టాపిక్ బయటికి వచ్చింది.వీరి విడాకుల ముందు ప్రియాంక తన ఇన్ స్టాగ్రామ్ లో జోనస్ పేరును తొలగించింది.దాంతో అప్పటి నుంచి నెటిజన్లకు అనుమానాలు రావడంతో తెగ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

Telugu Bollywood, Divorce, Kamal Khan, Krk Joshyam, Matrix, Nick Jonas, Priyaka

ఇదిలా ఉంటే తాజాగా వీరి విడాకులు నిజమేనేమో అని అనుమానాలు వస్తున్నాయి.ఇంతకు ఏం జరిగిందో చూద్దాం.ప్రియాంక ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.అందులో తాను మోస్ట్ ఐకానిక్ ఫిలిం ఫ్రాంచైజీకి చెందిన ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్ అనే సినిమాలో నటించింది.ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

దీంతో ప్రమోషన్స్ భాగంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ప్రియాంక.

ఈ నేపథ్యంలో తాను ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకుంటూ తన వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని విషయాలు పంచుకుంది.అయితే తాను ఈ సినిమాను ప్రమోట్ చేసే స్థాయిలో ఉన్న కూడా తనని ఇప్పటికీ ‘ది వైఫ్ ఆఫ్ నిక్ జోనస్’ గా సూచించడం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది.

Telugu Bollywood, Divorce, Kamal Khan, Krk Joshyam, Matrix, Nick Jonas, Priyaka

మహిళలకు ఇప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో అని తెలిపింది.అంతేకాకుండా తాను తన ఐఎమ్ డీబి లింక్ ని తన బయో కి జోడించాలా అంటూ ప్రశ్నించింది.అయితే దీన్ని బట్టి చూస్తే కేఆర్కే జోస్యం నిజం అవ్వనున్నట్లు తెలుస్తుంది.ఎందుకంటే గతంలో బాలీవుడ్ నటుడు క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ప్రియాంక, జోనస్ గురించి గతంలోనే ఓ జోస్యం చెప్పాడు.

గతంలో తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేస్తూ.మీరు చెబుతున్నది నిజమేనా? తమాషా చేస్తున్నారా? వీరిద్దరు మూడేళ్ళలో విడిపోతారు అని నేను ముందే ఊహించాను.ఇప్పుడు ఆ సమయం వచ్చింది.నా అంచనా తప్పు కాదు అని.అనడంతో మొత్తానికి విడిపోవడం నిజమే అని అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube