వసంత పంచమి రోజు ఈ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం?

హిందూ సంప్రదాయ ప్రకారం ప్రతి నెలా ఎన్నో రకాల పండుగలను జరుపుకుంటారు.ఈ విధంగా మాఘ మాసంలో కూడా ఎన్నో ప్రత్యేకమైన రోజులను ఎంతో పవిత్రంగా భావిస్తారు.

 Is It Good To Wear This Type Color On Vansntha Panchami Day Details, Vasantha P-TeluguStop.com

ఇలా మాఘమాసంలో శుక్లపక్షంలో 5వ రోజున ప్రతి ఏడాది ఘనంగా వసంత పంచమిని జరుపుకుంటారు.ఇలా వసంత పంచమి రోజుపెద్ద ఎత్తున సరస్వతీదేవిని పూజిస్తూ అమ్మవారి కరుణాకటాక్షాలు తమ పిల్లలపై ఉండాలని భావిస్తారు.

ఇలా వసంత పంచమి రోజు అమ్మవారిని పూజించే సమయంలో ఎలాంటి దుస్తులను ధరించి పూజ చేయాలి అనే విషయానికి వస్తే…

వసంత పంచమి రోజు ప్రకృతితో ఐక్యం కావడం కోసం ప్రతి ఒక్కరూ పసుపు రంగు దుస్తులను ధరించాలని పండితులు చెబుతున్నారు.ఇలా పసుపు రంగు దుస్తులను ధరించి అమ్మవారిని పూజించడం శుభప్రదం.

పసుపు శుభానికి సంకేతం కనుక ఇలాంటి రంగు దుస్తులను ధరించాలని పండితులు చెబుతున్నారు.పురాణాల ప్రకారం వసంత పంచమి రోజు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని చెబుతారు.

Telugu Ammavaru Pooja, Brahma, Color, Hindu, Megha Masam, Saraswati Devi, Worshi

ఇలా విశ్వాన్ని సృష్టించినప్పుడు ఎరుపు, నీలం పసుపు రంగులు కనిపించాయని వాటిలో ముందుగా పసుపు రంగు కనిపించిందని పండితులు చెబుతున్నారు.అందుకే ఈ వసంత పంచమి రోజు పసుపు రంగు దుస్తులను ధరించడం శుభప్రదమని భావిస్తారు.వసంత పంచమి నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతుంది ఈరోజు నుంచి పుడమిపై ఎక్కడ చూసినా పసుపుపచ్చగా కనిపిస్తుంది కనుక ఆ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం శుభకరం ఇలా పసుపు రంగు దుస్తులను ధరించడం వల్ల నాడీ వ్యవస్థ, మెదడు కూడా చురుకుగా పనిచేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube