కృష్ణుడు 'వెన్న' ఎందుకు దొంగలించేవాడో తెలుసా?

మన హిందూ మతంలో చిన్ని కన్నయ్యకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది.జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా వాటిని అధిగమించే శక్తిని భగవద్గీతలో ప్రసాదించిన స్ఫూర్తిదాత చిన్ని కృష్ణయ్య.

 Reason Behind Lord Krishna Stealing Butter, Lord Sri Krishna, Hindu Ritual, Kris-TeluguStop.com

చిన్నతనంలో ఎన్నో అల్లరి పనులు చేసి తల్లి యశోద దగ్గర ఎన్నో చివాట్లు తిన్న ఆబాల కన్నయ్యను అందరూ వెన్నదొంగ అని కూడా పిలుస్తారు.అయితే కృష్ణుడు అందరి ఇళ్లలో వెన్నను దొంగలించి తినడం వల్ల కన్నయ్యకు వెన్నదొంగ అనే పేరు వచ్చింది.

కృష్ణుడు వెన్నను దొంగలించడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

చిన్ని కృష్ణుడు గోకులంలో అందరి ఇళ్లలో వెన్నెల దొంగలించడంతో పాటు, వెన్నలా, స్వచ్ఛమైన, మృదువైన అందరి హృదయాలను కూడా దొంగలించాడు.

వెన్న తెల్లగా ఉంటుంది.అలాగే మన హృదయాలు కూడా మచ్చలేనివిగా ఉండాలని, హృదయంలో కోపం, ఆహం, ద్వేషం, అసూయ వంటి వాటిని పోషించ కూడదని అందరి హృదయం వెన్నెలా ఉండాలనే ఉద్దేశంతో చిన్ని కన్నయ్య వెన్న దొంగతనం చేశాడు.

అందుకే కృష్ణుడిని చిట్టా చోర్ ( హృదయాలను దొంగలించే వాడు) అని కూడా పిలిచేవారు.

పెరుగును చూర్ణం చేసేటప్పుడు వెన్న తేలికగా పైకి వస్తుంది.

అదేవిధంగా మన మనస్సు భౌతిక ప్రపంచం నుండి వేరు చేయాలి.అంటే మనసు వెన్నలా తేలికగా ఉండాలి అని అర్థం.

చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి గోకులంలోని ఇళ్లలో వెన్నను దొంగతనం చేసి అందరి మధ్య ఐక్యతను చాటాడు.అంతేకాకుండా వారిలో ఎంతో శారీరక బలం చేకూర్చాడు.

అందువల్ల కృష్ణాష్టమి వేడుకలు జరిగినప్పుడు ఉట్టి కొట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.ఉట్టి కొట్టే కార్యక్రమంలో అందరూ ఒకరిపై ఒకరు నిలబడి ఐక్యతను చాటి చెబుతూ ఉంటారు అని దీని అర్థం.

చిన్ని కృష్ణుడు తన బాల్యంలో ఎన్నో చిలిపి పనులు చేస్తూ గోకులంలో అందరి మనసులు గెలిచాడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube