జనసేనలో వర్గ పోరు??

ఉభయగోదావరి జిల్లాలో 11 నియోజకవర్గాలను కవర్ చేసేలా జనసేన పార్టీ ప్లాన్ చేసిన వారాహి యాత్ర ఈరోజు నుండి ప్రారంభమవుతుంది.అన్నవరం సత్యదేవుని దర్శనం తర్వాత యాత్ర ప్రారంభమవుతుంది.

 Internal War In Janasena Party-TeluguStop.com

మొదటి బహిరంగ సభ కత్తిపూడి జంక్షన్ లో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది .ప్రతి నియోజకవర్గంలోనూ ప్రత్యేకంగా ఎక్కడ సమస్యలను అక్కడే పరిశీలించి అక్కడ ప్రజలతో చర్చించి ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకునే విధంగా నూతన విధానంలో ఈ యాత్రను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది.మౌలిక సదుపాయాల విషయంలో కానీ అభివృద్ధి పరమైన విషయాలలో గాని ప్రభుత్వం నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో గానీ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా జనవాణి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారని సమాచారం.వచ్చే ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని చూస్తున్న జనసేనకు ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా చెప్పవచ్చు ప్రజల్లో ఈ యాత్ర ద్వారా ప్రజల్లో పార్టీ పట్ల ఆసక్తి ని పెంచే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లుగా తెలుస్తుంది.

Telugu Ap, Godavari, Janasena, Kandula Durgesh, Pawan Klayan, Settibathula, Ys J

అయితే అన్ని రాజకీయ పార్టీలు లాగే జనసేనలో కూడా ఈ యాత్ర సందర్భంగా వర్గ పోరు బయటపడినట్లు తెలుస్తుంది.తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ కందులు దుర్గేష్( Kandula Durgesh ) వర్గానికి , అమలాపురం నియోజకవర్గం ఇన్చార్జి సెట్టు బత్తుల రాజబాబు( Setti bathula Rajababu ) వర్గానికి మరియు డిఎంఆర్ శేఖర్ వర్గానికి మధ్య ఆదిపత్య పోరుకు తెరలేసినట్లుగా తెలుస్తుంది .ఈ మూడు వర్గాల నాయకులు ఎవరికి వారే అన్నట్లుగా వరాహి యాత్ర పోస్టర్ను విడుదల చేసుకోవడం నేతల మధ్య ఉన్న అనైక్యత బయటపడుతుంది .సరైన నాయకత్వం లేకపోయినా పవన్ కళ్యాణ్ ( Pawan klayan )మీద ఉన్న ఇష్టంతో అహరోహం శ్రమిస్తున్న జనసైనికులకు ఈ నేతల వ్యవహార శైలి అసంతృప్తి కలిగిస్తున్నట్లుగా సమాచారం.

Telugu Ap, Godavari, Janasena, Kandula Durgesh, Pawan Klayan, Settibathula, Ys J

స్థానిక కార్యకర్తలను కలుపుకొని పోయి పార్టీని బలపరచాల్సిన ఇలాంటి సమయంలో ఇలాంటి వర్గ పోరు పార్టీకి నష్టం తెస్తుందని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది .మరి నేతల మధ్య వర్గ పోరు పై జనసేన ఎలా డి చర్యలు తీసుకుంటుందో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube