నాంపల్లి మండల కేంద్రంలో అంతర్గత రోడ్లు బురదమయం

నల్లగొండ జిల్లా:నాంపల్లి మండల( Nampally కేంద్రంలో అంతర్గత రోడ్లు మొత్తం అస్తవ్యస్తంగా తయారై బయటికి వెళ్ళలేని దుస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంబేద్కర్ విగ్రహం వెనకాల,నాంపల్లి నుండి మల్లేపల్లి దారిలో గుంతల్లో మురికి మీరు నిలిచి పాదచారులు కూడా నడవలేని స్థితిలో ఉందని,అందులో ఎక్కడ గుంత ఉందో తెలియక పిల్లలు,వృద్దులు,వికలాంగులు ఇంట్లో నుండి రావడానికి భయపడుతున్నారని,గత 8 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా పట్టించుకునే వారు లేకపోవడం శోచనీయం అంటున్నారు.

మండల కేంద్రంలో నిత్యం అధికారులు, ప్రజా ప్రతినిధులు తిరుగుతూ ఉన్నా ఎవరికీ కనిపించక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని వాపోతున్నారు.పాలకులు మారినా నాంపల్లి పట్టణంలో రోడ్లు మారలేదు, నీరు నిలవడం ఆగలేదని మం )డిపడుతున్నారు.

రోజుల తరబడి మురికి నీరు నిల్వలు పేరుకొని బురదమయంగా మారడంతో దోమలు,ఈగలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారని,ఎన్నిసార్లు మీడియాలో వచ్చినా,కంప్లైంట్ చేసినా పట్టించుకునే నాధుడే లేడని అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మండల కేంద్రంలో మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నేరేడుచర్ల ఎరువుల దుకాణాలలో తనిఖీలు
Advertisement

Latest Suryapet News