హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని పొలిటీషియన్స్ భార్యలు వీరే

కొంత మంది రాజకీయ‌న నాయ‌కుల భార్య‌లు సినిమా తార‌ల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నారు.

అందంతో పాటు తెలివి, నాయ‌క‌త్వ ప్ర‌తిభ వీరికి మ‌రింత ఆక‌ర్ష‌ణ‌గా ఉన్నాయి.

భ‌ర్త చాటు భార్యాల్లా ఉండ‌కుండా కొంద‌రు రాజ‌కీయాల్లోకి అడుగు పెడితే.మ‌రికొంద‌రు త‌మ‌కు ఇష్ట‌మైన రంగాల్లో ముందుకెళ్తున్నారు.హీరోయిన్ల‌కు ఏమాత్రం తీసిపోని కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల స‌తీమ‌ణుల గురించి ఇప్ప‌డు తెలుసుకుందా!

సారా పైలెట్:

ఈమె రాజ‌స్థాన్ ఉప ముఖ్య‌మంత్రి స‌తీమ‌ణి. ఆమె కాశ్మీరీ లీడ‌ర్ అయిన ఫ‌రూక్ అబ్దుల్లా కూమార్తె.కాలేజీలో ఉండ‌గా స‌చిన్ పైలెట్ తో ఉన్న ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది.2004లో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు.త‌న భ‌ర్త‌కు రాజ‌కీయ స‌ల‌హాలు సారానే ఇస్తుంది.

డింపుల్ యాద‌వ్:

ఉత్త‌ర ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి స‌తీమణి డింపుల్ యాద‌వ్.వీరికి 1999లో వివాహం అయ్యింది.తొలుత రాజ‌కీయాల గురించి అంత‌గా ప‌ట్టించుకోని త‌ను.

Advertisement

ఆ త‌ర్వాత ఇంట్రెస్ట్ చూపించింది.అనంత‌రం రాజకీయాల్లోకి దిగింది.

క‌న్నౌజ్ నుంచి ఎంపీగా విజ‌యం సాధించారు.

ప్రియ‌ద‌ర్శిని రాజే సింథియా:

ఇటీవ‌లే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నాయ‌కుడు జ్యోతిరాధిత్య సింథియా భార్య ఈమె.ప్ర‌స్తుతం ఆయ‌న రాజ్య‌స‌భ సభ్యుడిగా కొన‌సాగుతున్నారు.ప్రియ‌ద‌ర్శినితో సింథియా వివాహం 1994 లో జ‌రిగింది.

హ‌ర్సిమ్ర‌త్ కౌర్ బాద‌ల్:

ఈమె ప్ర‌స్తుతం శిరోమ‌ణి అకాలీద‌ల్ పార్టీ నుంచి ఎంపీగా విజ‌యం సాధించారు.కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట‌ర్ గా ప‌నిచేసి రాజీనామా చేశారు.ఈమె సుఖ్ బీర్ సింగ్ బాద‌ల్ భార్య‌.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

ఆయ‌న పంజాబ్ కు డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్ గా ప‌నిచేశారు.

అమృత రాయ్ :

Advertisement

ఈమె కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ రెండ‌వ భార్య‌.మొద‌టి భార్య మ‌ర‌ణాంత‌రం ఈమెను 2015లో వివాహం చేసుకున్నాడు.గ‌తంలో ఈమె జ‌ర్న‌లిస్ట్ గా ప‌నిచేశారు.

ఆ సంద‌ర్భంలోనే డిగ్గీతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.అది ప్రేమ‌గా మారి పెళ్లి వ‌ర‌కు దారి తీసింది.

అమృత ఫ‌డ్న‌విస్:

మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర‌ ఫ‌డ్న‌విస్ స‌తీమ‌ణి అమృత ఫ‌డ్న‌విస్.వీరికి 2005లో వివాహం జ‌రిగింది.అమృత ప్ర‌స్తుతం యాక్సిక్ బ్యాంక్ వెస్ట్ ఇండియా కార్పోరేట్ కు వైస్ ప్రెసిడెంట్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

మోడ‌లింగ్‌లోనూ రాణిస్తున్నారు.

తాజా వార్తలు