అక్రమ అరెస్టులతో బహుజన వాదాన్ని ఆపలేరు:బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ

సూర్యాపేట జిల్లా:వట్టే జానయ్య యాదవ్( Vatte Janaiah Yadav ) అజ్ఞాతం నుండి అసెంబ్లీలో అడుగు పెడతాడని,అక్రమ కేసులు బహుజన వాదాన్ని ఆపలేవని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో బీఎస్పీ జిల్లా నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.

ముందుగా జిల్లా బీఎస్పీ ఆధ్వర్యంలో ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి విద్యానగర్ బీఎస్పీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం నూతన పార్టీ కార్యాలయం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ర్యాలీకి పోలీసులు అనేక ఆంక్షలు విధించారు.

కనీసం మా దేవుడైన బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేయడానికి అనుమతి ఇవ్వలేదు.బహుజన బిడ్డల మీద పోలీసులు కేసులు పెడుతున్నారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నాం.అగ్రవర్ణాల భూస్వామ్యుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుందన్నారు.

Advertisement

వట్టే జానయ్య ఆస్తులు అడుగుతున్న మంత్రి జగదీష్ రెడ్డి( Minister Jagdish Reddy ) తన ఆస్తులను వెల్లడించగలరా అని ప్రశ్నించారు.తన భర్తకు న్యాయం జరగాలని ఒక మహిళ పోరాటం చేస్తుంది.

ఆమెకు బీఎస్పీ అండగా వుంటుందని స్పష్టం చేశారు.బహుజన రాజ్యాధికారాన్ని ఎవ్వరూ ఆపలేరని,సూర్యాపేట ఎమ్మెల్యేగా వట్టే జానయ్య యాదవ్ ను క్యాంప్ కార్యాలయంలో కూర్చోబెట్టి తీరుతాం.

గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి జానయ్య మీద ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు.బీఆర్ఎస్,కాంగ్రెస్,బీజేపీ పార్టీల్లో వున్న బీసీ,ఎస్సీ, ఎస్టీ బిడ్డలు బహుజన రాజ్యం కోసం బహుజన సమాజ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని,సూర్యాపేటలో బహుజన బిడ్డ వట్టే జానయ్య యాదవ్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అధికార పార్టీకి జై కొట్టటం ఎంతవరకు సమంజసం? నా 20 సంవత్సరాల సర్వీస్ లో ఇలాంటి పోలీస్ అధికారిని ఎప్పుడూ చూడలేదు.మంత్రి జగదీష్ రెడ్డి ఆక్రమించిన భూములు లక్షల కోట్లల్లో ఉన్నాయి,త్వరలోనే చిట్టా బయటపెడతాం.

సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల కంటే ఎక్కువ వేతనం .. భారత సంతతి సీఈవో అరుదైన ఘనత..!!
ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఇక మూట ముల్లె సర్డుకోవాల్సిందేనని అన్నారు.కాళోజి నారాయణరావు చెప్పినట్లు ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడే పాతిపెట్డాలని అన్నారు.

Advertisement

వట్టే జానయ్య యాదవ్ ను లక్ష ఓట్ల మెజారిటీతో బహుజన వాదాన్ని గెలిపించాలని,బహుజన రాజ్యం సాధించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.తెలంగాణలో మూడు కోట్ల మంది బహుజనులు జైలు భరో పిలుపునిస్తే జైల్లు సరిపోవని అన్నారు.

వట్టే జానయ్య యాదవ్ రాబోయే ఎమ్మెల్యేగా సూర్యాపేటలో పారదర్శకమైన పాలన అందిస్తారన్నారు.ఈ కార్యక్రమంలో 13 వ వార్డు కౌన్సిలర్ వట్టే రేణుక యాదవ్,చాంద్ పాషా, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బుడిగం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest Suryapet News