ఎస్సీ వర్గీకరణ జరిగితే 59 ఉపకులాలకు న్యాయం జరుగుతుంది

సూర్యాపేట జిల్లా: ఎస్సీ వర్గీకరణ జరిగితే 59 ఎస్సీ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని మహాజన సోషలిస్ట్ పార్టీ సూర్యాపేట జిల్లా ఇన్చార్జి యాతాకుల రాజన్న అన్నారు.

శుక్రవారం ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల, గ్రామంలో ఎమ్మెస్సీ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ 50 రోజులు గ్రామాలకు తరలి వెళ్ళండని ఇచ్చిన పిలుపు మేరకు కందగట్ల, కోటపహాడ్ గ్రామాల్లో నిర్వహించిన కమిటీల ఎన్నిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం మహా జననేత మందకృష్ణ మాదిగ నేతృత్వంలో గత 29 సంవత్సరాలుగా పోరాడుతున్నామని తెలిపారు.

గతంలో ఐదు సంవత్సరాలు వర్గీకరణ ఫలితాలు అనుభవించిన ఎస్సీల్లో 59 కులాలకు సమన్యాయం జరిగిందని, అందుకే వర్గీకరణ వెంటనే జరగాలని,కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ములకలపల్లి రవి మాదిగ,మారేపల్లి జగన్ మాదిగ, ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి నాయకులు,మేడి కృష్ణ మాదిగ,తిప్పర్తి గంగరాజు మాదిగ,చింత వినయ్ బాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Latest Suryapet News