డబ్బింగ్ వెబ్ సిరీస్ లకి డబ్బులే డబ్బులు

సినిమా అంటే కళా రంగం.కానీ.

 Huge Profits For Telugu Dubbed Web Series Details, Huge Profits ,telugu Dubbed W-TeluguStop.com

, అల్టిమేట్ గా ఇక్కడ లెక్క తేల్చేది డబ్బు మాత్రమే.డబ్బులు పెట్టిన నిర్మాతకి, సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి బయ్యర్స్ కి లాభం వచ్చిందా? లేదా? అన్నదే మ్యాటర్.పెద్ద పెద్ద సినిమాలు చేసి చిన్న లాభాలను సొంతం చేసుకునే వారు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.చిన్న సినిమాలను తీసి పెద్ద లాభాలను అనుభవించే వారు ఉన్నారు.

కానీ., అసలు సినిమానే తీయకుండా, డబ్బింగ్ మూవీలు ఇప్పుడు తెలుగునాట కోట్లు కొల్లగొడుతున్నాయి.

ఇక ఓటీటీలు రావడం, వీటిలో వెబ్ సిరీస్ లకి ఆదరణ పెరగడంతో ఈ డబ్బింగ్ బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్టు సాగిపోతోంది.ముఖ్యంగా తెలుగులో డబ్ అవుతున్న వెబ్ సిరీస్ లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ సిరీస్‌తో ఇండియాలో వెబ్‌సిరీస్‌లను ప్రేక్షకులకు అలవాటు చేసింది.ఆ తరువాత వచ్చిన ‘మనీ హెయిస్ట్‌’ ఒక ప్రభంజనం సృష్టించింది.

కానీ., మాస్ ప్రేక్షకులకు వెబ్ సిరీస్ లు అలవాటు అయ్యేలా చేసింది మాత్రం ‘ద ఫ్యామిలీ మ్యాన్‌’, ‘మీర్జాపూర్‌’, అని చెప్పుకోవచ్చు.

వెబ్‌సిరీస్‌ హిట్టయితే సీజన్ల మీద సీజన్లు తీయవచ్చు.చందాదారుల సంఖ్య పెరుగుతుంది.

కొంచెం లేటుగా అయినా తెలుగులో డబ్‌ చేసి వదులుతున్నారు.హిందీ, ఇంగ్లీష్‌, కొరియన్‌, ఫ్రెంచి వెబ్‌సిరీస్‌లను కూడా ఓటీటీ సంస్థలు తెలుగులో డబ్‌ చేస్తున్నాయి.

Telugu Game, Profits, Mirzapur, Heist, Multiple Web, Netflix, Ott Platms, Prime,

దీంతో.ఈ వెబ్ సిరీస్ ల నిర్మాతలకి తెలుగునాట లాభాల పంట పండిస్తున్నాయి.అమెజాన్‌ ప్రైమ్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌, జీ 5, నెట్‌ఫ్లిక్స్‌లో, హాట్‌స్టార్‌లో, సోనీలివ్‌ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ తెలుగునాట ఆ నిర్మాతలకి లాభాల పంట పండిస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీ జైన్ట్స్ కి ఇప్పుడు ఈ డబ్బింగ్ వెర్షన్స్ ఊహించని లాభాలు తెచ్చి పెడుతున్నాయి.

ఒక్క భాషలో షూట్ చేసిన స్టఫ్ ని అన్నీ రీజనల్ లాంగ్వేజెస్ లో డబ్ చేసి కోట్లు గడిస్తున్నారు.

Telugu Game, Profits, Mirzapur, Heist, Multiple Web, Netflix, Ott Platms, Prime,

వీటికి పోటీగా రీజనల్ ఓటీటీ లు వస్తున్నా.అవి కూడా డబ్బింగ్ స్టఫ్ నే నమ్ముకుని ముందుకి పోతున్నాయి.కంటెంట్ క్వాలిటీ విషయంలో మిగతా ఓటీటీలతో రీజనల్ ఓటీటీలు పడలేకపోతున్నాయి అనేవి ఓపెన్ సీక్రెట్.

ముఖ్యంగా తెలుగునాట ఇంటెర్నేషనల్ ఓటీటీలు ఇలా డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారా కోట్లు కొల్లగొడుతున్నాయి.మరి.ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube