క్షుద్రపూజల పేరుతో భర్తను స్మశానానికి పంపి భార్యను అత్యాచారం చేసిన స్వామీజీ..

ఎన్ని ఘటనలు వెలుగులోకి వచ్చినా ఇంకా మూఢనమ్మకాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

రోజూ టీవీల్లో, పేపర్లలో ఎంత మంది దొంగ బాబాలు బయట పడినా ప్రజల్లో మార్పు రావడం లేదు.

రోజురోజుకూ టెక్నాలిజీ పెరుగుతున్న ప్రజలలో ఇంకా మార్పు రావడంలేదు.ఇంకా స్వామీజీలు, బాబాలను నమ్ముతూ గుడ్డిగా మోసపోతున్నారు.

ఇలాంటి ఘటనే తాజాగా బీహార్ లో చోటుచేసుకుంది.పెళ్లి జరిగి నాలుగు సంవత్సరాలు అయినా ఇంకా పిల్లలు పుట్టలేదని, ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయని ఆ దంపతులు వారి స్నేహితుడు సహాయంతో ఒక జ్యోతిష్యుడిని కలిసి తమ ఇబ్బందులను గురించి చెప్పారు.

వాటిని ఆసరాగా తీసుకున్న ఆ స్వామిజీ కొన్ని పూజలు చేస్తే మీ ఇబ్బందులు అన్ని దూరం అవుతాయని వారిని నమ్మించి భర్తను స్మశానం దగ్గర మట్టి తీసుకురమ్మని పంపించి భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

Advertisement

బీహార్ రాష్ట్రము చంపారన్ జిల్లాలో ఒక జంట స్వామీజీని నమ్మి మోసపోయారు.ఆ దంపతులకు పెళ్లి అయ్యి నాలుగు సంవత్సరాలు అయ్యింది.

అయినా పిల్లలు పుట్టక పోవడంతో కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరిగింది.అంతేకాక ఆర్థిక సమస్యలతో కూడా సతమతమవుతున్నారు.

ఆ భార్యాభర్తలకు ఏం చేయాలో అర్ధం కాలేదు.దీంతో అతడు తన స్నేహితుడికి విషయమంతా చెప్పడంతో అతడు ఒక జ్యోతిష్యుడి గురించి చెప్పడంతో అతడిని కలిసి వారి సమస్యలను చెప్పాడు.

ఆ స్వామీజీ దంపతులిద్దరూ వచ్చి కలవాలి అని చెప్పడంతో భార్యను తీసుకుని వెళ్ళాడు.అయితే ఆ స్వామీజీ ఆమెపై కన్నేశాడు.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : తలుపు తెరిస్తే ఎదురుగా భీకరమైన పులి.. చివరికేమైందో చూస్తే షాక్!

కొన్ని పూజలు చేస్తే మీ ఇబ్బందులన్నీ తొలగి పోతాయని చెప్పి ఆ దంపతుల ఇంటికి వెళ్ళాడు.అర్ధరాత్రి వారి ఇంటికి వెళ్లిన జ్యోతిష్యుడు అతడిని స్మశానంలో మట్టిని తీసుకురమ్మని పంపించాడు.

Advertisement

తర్వాత ఆమెను నగ్నంగా మారిపోమని చెప్పగా అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను బంధించి ఆమెపై అత్యాచారం చేసాడు.ఈ విషయం ఎవరికైనా చెప్తే నువ్వు చనిపోతావ్ అని బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

అయితే ఆమె తన సోదరుడికి జరిగిన విషయమంతా చెప్పేసింది.అతడి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ స్వామీజీని అదుపులోకి తీసుకున్నారు.

తాజా వార్తలు