ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసేవి.చిరు మూవీ ఫలానా డేట్ లో రిలీజ్ అవుతుంటే ఆ తేదీకి ముందు, వెనకా తమ మూవీ రిలీజ్ చేయడానికి ఎవరూ ధైర్యం చేసేవారు కాదు.
చిరు సినిమా వస్తే మన సినిమా ఎవరు చూస్తారు? అనే ఒక అభిప్రాయంలో వారు ఉండేవారు.నిజానికి మెగాస్టార్ మూవీ ముందు ఏ సినిమా కూడా నిలబడలేకపోయేది.
కానీ కొన్ని సినిమాలు మాత్రం చిరు సినిమాలు రిలీజ్ అయినప్పుడే రిలీజ్ అయ్యి అతని సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టాయి.అవేవో చూద్దాం.
ఆర్.నారాయణమూర్తి( R Narayana Murthy ) గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు.
ఆయన హీరోగా, దర్శకుడిగా, ప్రొడ్యూసర్ గా తీసిన సినిమాలు ఎన్నో వరుసగా సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి.వాటిలో ఒకటి ‘ఒరేయ్.రిక్షా!’.( Orey Rikshaw Movie ) ఈ సినిమా సమాజాన్ని ఆలోచింపజేసే కథతో వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.1995, నవంబర్ 9న వచ్చిన ఈ మూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు.సూర్యంగా యాక్ట్ కూడా చేశాడు.
ఈ మూవీతో పాటు ఇందులోని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.ముఖ్యంగా “నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ” ఊపు ఊపేసింది.
ఈ మూవీ రిలీజ్ అయిన కొద్ది రోజులకు కోడి రామకృష్ణ, చిరంజీవి కాంబినేషన్‌లో ‘రిక్షావోడు ‘( Rikshavodu Movie ) మూవీ విడుదల అయింది.దీనిపై ముందు నుంచి అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.అయితే అది అంచనాలను చేరుకోలేదు సరి కదా కనీసం యావరేజ్ హిట్ కూడా అందుకోలేకపోయింది.ఈ మూవీ ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది.ఒరేయ్ రిక్షా సినిమా అప్పటికీ ఆడుతుండటం వల్ల చిరంజీవి సినిమా దెబ్బయిపోయింది.ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొన్న చిరంజీవి నారాయణమూర్తి సినిమా తన సినిమాను బీట్ చేసిందని వెల్లడించాడు.
దీనివల్ల తనకు బాధ ఏం లేదని, కానీ చాలా గర్వంగా అనిపించిందని పేర్కొన్నాడు.
ఇక చిరంజీవి సినిమాని బీట్ చేసిన మరో మూవీ బాలయ్య( Balakrishna ) హీరోగా వచ్చిన నరసింహనాయుడు (2001).( Narasimha Naidu ) ఏ మూవీ ఒక్క చిరంజీవి సినిమా నే కాదు అన్నిటిని చిత్తు చేస్తూ ఇండస్ట్రీ హిట్ సాధించింది.సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ రిలీజ్ అయింది.
అదే సంక్రాంతికి విడుదలైన “మృగరాజు” సినిమా( Mrugaraju Movie ) డిజాస్టర్ అయింది.అయితే చిరంజీవి సినిమాని చిత్తు చేస్తూ బాలకృష్ణ సినిమా సూపర్ హిట్ కావడంతో అప్పట్లో నందమూరి అభిమానులకు చాలా గర్వపడ్డారు.