నిన్న మొన్నటివరకు తెలుగుదేశం పార్టీ( TDP ) తెలంగాణలో కూడా పోటీ చేసి తీరుతుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్( Kasani Gnaneshwar ) ప్రకటించారు.తెలుగుదేశం అనుకూల మీడియా ఈసారి తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేయకుండా ఉంటేనే బాగుంటుందని ముఖ్యంగా ఇక్కడ పోటీ బారాస వర్సెస్ కాంగ్రెస్కు గా మారిపోయిన ప్రస్తుత తరుణంలో చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అధ్యక్షుడుగా( Revanth Reddy ) ఉన్న కాంగ్రెస్కు లబ్ది చేకూరాలంటే తెలుగుదేశం న్యూట్రల్ గా ఉండటమే మంచిదంటూ విశ్లేషణలు వచ్చాయి.
అయితే ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మాత్రం వాటన్నిటిని ఖండించి ఇప్పటికే సగం లిస్టు పూర్తయిపోయిందని మరో సగం లిస్టు చంద్రబాబుని కలిసిన తర్వాత పూర్తి చేస్తామంటూ ప్రకటించారు.
అన్ని స్థానాలలోనూ తెలుగుదేశం పోటీకి దిగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.అయితే ఇప్పుడు సీన్ మారినట్టుగా కనిపిస్తుంది.ముఖ్యంగా బారాస( BRS ) మరోసారి అధికారంలోకి వస్తే ఆంధ్రాలో తెలుగుదేశం కు కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని జగన్కు అన్ని విధాలా మద్దతు ఇస్తున్న కేసిఆర్ ( KCR ) తెలంగాణలో మరోసారి అధికారం లోకి రాకూడదంటే కాంగ్రెస్కు కి పరోక్ష మద్దతు ఇచ్చి తీరాల్సిందేనన్న తెలుగుదేశం వ్యూహకర్తల సూచనలతోనే చంద్రబాబు మనసు మార్చుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేయట్లేదు అంటూ ఇప్పుడు అనధికారిక లీకులు వస్తున్నాయి.
అయితే చెప్పుకోదగ్గ బిసి నేతగా పేరు ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు కాశాని పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న గా మారింది.ఏదో ఒక పార్టీ నుంచి ఆయన పోటీ చేయడం పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ ఈసారి పోటీ చేయకపోతే మాత్రం తెలుగుదేశం పూర్తిగా తెలంగాణ రాజకీయాల లోంచి అంతర్ధానం అవుతుందని చెప్పవచ్చు.అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రస్తుత తరుణం లో తెలంగాణలో అనుకూల ఫలితాలు రాకపోతే ఆ ఎఫెక్ట్ ఆంధ్రా ఎన్నికలపై పడుతుందన్న మరో కారణం కూడా తెలుగుదేశం వెనకకుతగ్గడానికి కారణం అంటూ కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.