ఆటోలో ప్రమాదకరంగా ప్రయాణిస్తే కఠిన చర్యలు:ఎస్ఐ లక్ష్మీనర్సయ్య

సూర్యాపేట జిల్లా:జిల్లాలో జరుగుతున్న ఆటో ప్రమాదాల నేపథ్యంలో శనివారం హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పాలకవీడు మండల కేంద్రంలోఎస్ఐ లక్ష్మీనర్సయ్య స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

ప్రమాదకరంగా ప్రయాణించే ఆటో కూలీలను ఆపి రోడ్డు ప్రమాదాలపై ఆటో డ్రైవర్లు,కూలీలకు అవగాహన కల్పించారు.

అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ఆటోలలో పరిమితికి మించి కూలీలను ఎక్కిస్తే డ్రైవర్ పై కఠిన చర్యలు ఉంటాయని,నిబంధనలు పాటించని వాహనాలపై, డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ప్రయాణికులు కూడా వివిధ పనుల నిమిత్తం ప్రయాణించేటప్పుడు ప్రమాదకర రీతిలో ఆటోల్లో,ట్రాక్టర్లలో పరిమితికి మించి ప్రయాణించి ప్రమాదాల బారిన పడొద్ధని,ఛార్జీల పైసల కోసం ఆలోచించి ప్రాణాలను కోల్పోవద్దని సూచించారు.

Harsh Action If Traveling Dangerously In An Auto SI Lakshminarasaiyya , SI Laks

Latest Suryapet News