హుజూర్ నగర్ కు అదనపు జిల్లా కోర్టు మంజూరు

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ లో అదనపు జిల్లా కోర్టును మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయ, శాసనసభ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి నరసింగరావు జీవో నెంబర్ 599 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

హుజూర్ నగర్ కు అదనపు జిల్లా కోర్టు మంజూరి కొరకు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ న్యాయవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఎట్టకేలకు న్యాయవాదుల కోరిక ఫలించి ప్రభుత్వం అదనపు జిల్లా కోర్టును మంజూరు చేయడం పట్ల న్యాయవాదులు బుధవారం హార్షం వ్యక్తం చేస్తూ బాణాసంచా పేల్చి,మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.

అదనపు జిల్లా కోర్టు మంజూరు కొరకు పట్టు వదలని విక్రమార్కుడిలా అహర్నిశలు కృషి చేసిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రామిరెడ్డి,జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బార్ అసోసియేషన్ తరపున న్యాయవాదులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మంచు తూఫాన్
Advertisement

Latest Suryapet News