తప్పు చేసిన వారు ఎప్పటికైనా దొరికి పోతారనే విషయం మనం చాలా కేసుల్లో ప్రత్యక్షంగా చూశాం.తప్పు చేసిన వారు కొన్ని సార్లు నెలలకే బయట పడతారు, కొన్ని సార్లు సంవత్సరాలకు బయట పడతారు.
అయితే అమెరికాకు చెందిన 85 ఏళ్ల బామ్మ 35 ఏళ్ల క్రితం చేసిన హత్య కేసులో దోషి అని వెళ్లడయ్యింది.నాటకీయ పరిణమాల నేపథ్యంలో ఈమె హత్య కేసు నిరూపితం అయ్యింది.
పోలీసులకు అనుమానం రాకుండా చాలానే జాగ్రత్తలు పడ్డ ఆమె ఒక టీవీ షో ముందు మాత్రం అడ్డంగా బుక్ అయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… 1984వ సంవత్సరంలో జానీ అల్బీటన్ హత్యకు గురయ్యాడు.ఆయన భార్య నోర్మా తాను బయట నుండి వచ్చేప్పటికి జానీ చనిపోయి ఉన్నాడని, విండో నుండి హంతకులు పారిపోయి ఉండవచ్చు అంటూ పోలీసులకు చెప్పింది.పలు రకాలుగా కేసు విచారణ చేసినా కూడా హంతకులు ఎవరనే విషయంపై పోలీసులు ఒక నిర్ణయానికి రాలేక పోయాను.
నోర్మాపై అనుమానంతో ఆమెకు నార్కో టెస్ట్ కూడా చేశారు.కాని ఆశ్చర్యంగా అందులో కూడా ఆమె నిర్దోశని వెళ్లడయ్యింది.దాంతో గత 35 ఏళ్లుగా కేసును అలాగే ఉంచేశారు.క్లోజ్ చేయకుండా కేసును అలాగే ఉంచారు.
ఈమద్య కాలంలో అక్కడ కొన్ని కేసులను విచారించేందుకు ఒక టీవీ రియాల్టీ షో సిద్దం అయ్యింది.
‘కోల్డ్ జస్టీస్’ అనే టీవీ షోకు స్థానిక పోలీసులు ఈకేసు వివరాలన్నీ అందించారు.ఆ షో నిర్వాహకులు జానీ ఇంటి చుట్టు పక్కల దాదాపు 50 మందిని విచారించారు.చివరకు నోర్మాను కూడా షో నిర్వాహకులు ప్రశ్నించారట.
అయితే టీవీలో కనిపిస్తున్నా అనే ఆలోచనతో ఆమె అసలు విషయం చెప్పేసింది.ఎప్పుడో జరిగిన విషయాన్ని పోలీసులు ఇంకా గుర్తుకు పెట్టుకుని ఉంటారా, ఈ షోను ఏమైనా పోలీసులు చూస్తారా అంటూ అసలు విషయం చెప్పేసింది.
తానే గొడవల కారణంగా జానీని చంపేశానంటూ చెప్పింది.దాంతో వెంటనే ఆ షో నిర్వాహకులు తమకు మంచి టీఆర్పీ రేటింగ్ దక్కడంతో పాటు, పోలీసులకు ఒక కేసు గొడవ వదిలినట్లయ్యిందని ఆమె వివరాలను పోలీసులకు వెళ్లడించడం జరిగింది.
పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ముసలి తనం కారణంగా బెయిల్ ఇచ్చి విడుదల చేశారు.